Telugu News » Malkajgiri : మల్కాజిగిరి పార్లమెంట్ నేతలతో రేవంత్​ భేటీ.. వ్యూహాలపై దిశానిర్దేశం..!

Malkajgiri : మల్కాజిగిరి పార్లమెంట్ నేతలతో రేవంత్​ భేటీ.. వ్యూహాలపై దిశానిర్దేశం..!

మరోవైపు 17 పార్లమెంట్ నియోజకవర్గాల నాయకులతో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి వరుసగా సమీక్ష నిర్వహిస్తారని పీసీసీ వర్గాలు చెబుతున్నాయి. కాగా టీపీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్‌ ఈ సమావేశాలు, సమీక్షలు నిర్వహిస్తున్నారు..

by Venu

పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది నేతలు దూకుడు పెంచుతున్నారు.. గెలుపే లక్ష్యంగా ఎవరికి వారు వ్యూహాలు రచిస్తున్నారు.. మరోవైపు కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల విజయాన్ని.. పార్లమెంట్ ఎన్నికల్లో రిపీట్ చేయడానికి ఉవ్విళ్లూరుతుంది.. ఈ నేపథ్యంలో తాజాగా హైదరాబాద్ (Hyderabad), జూబ్లీహిల్స్​, మల్కాజిగిరి (Malkajgiri) పార్లమెంట్​ క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్​ నాయకులతో ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి సమావేశం నిర్వహించారు..

CM Revanth Reddy: Government's key decision...green signal for another project...!ఇందులో లోక్​సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలకు దిశానిర్దేశం చేశారు.. ఈ మేరకు లోక్​సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన ముఖ్య నాయకులు, నియోజకవర్గ ఇంఛార్జీలు, డీసీసీ అధ్యక్షులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇదిలా ఉండగా, సీఎం రేవంత్​ (CM Revanth Reddy) రెడ్డి లోక్​సభ నియోజకవర్గాలతో సమీక్ష, మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గంతో మొదలు పెట్టినట్లు తెలుస్తోంది.

మరోవైపు 17 పార్లమెంట్ నియోజకవర్గాల నాయకులతో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి వరుసగా సమీక్ష నిర్వహిస్తారని పీసీసీ వర్గాలు చెబుతున్నాయి. కాగా టీపీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్‌ ఈ సమావేశాలు, సమీక్షలు నిర్వహిస్తున్నారు.. అదేవిధంగా మల్కాజిగిరి కాంగ్రెస్ అభ్యర్థిగా సునీత మహేందర్ రెడ్డిని (Sunitha Mahender Reddy) నాయకులకు పరిచయం చేసే అవకాశాలు ఉన్నట్లు కాంగ్రెస్​ నేతలు అనుకొంటున్నారు..

You may also like

Leave a Comment