నేతల మాటలు గాల్లో దీపాలని అనుకొనివారు లేరట.. ముఖ్యంగా పేదవారి విషయంలో మాత్రం అక్షర సత్యమని ప్రచారంలో ఉంది. ఇక తెలంగాణ (Telangana) ప్రభుత్వం విద్యార్ధుల విషయంలో ఎంతో శ్రద్ధ వహిస్తున్నామని చెబుతోన్న అప్పుడప్పుడు వారి డొల్లతనం బయటపడుతోంది.
అధికారుల పర్యవేక్షణ లోపమా.. పాలకుల నిర్లక్ష్యం శాపమా తెలియదు గాని ఇప్పటికీ అక్కడక్కడ ఉన్న కస్తూర్బా గాంధీ పాఠశాలల్లోని ఆహారం విద్యార్థుల పాలిట విషంగా మారుతోంది. వారి ప్రాణాలకు సంకటంగా ఉంది. అసలే గ్యారంటీ లేని జీవితాలు.. అందులో చదువంటే భయం కలిగించే సంఘటనలు విద్యార్ధులకు ఎదురవుతుండటంతో చూసే వారి హృదయాలు తల్లడిల్లుతున్నాయట..
ఇక తాజాగా మంచిర్యాల (Manchirial) జిల్లా కన్నేపల్లి (Kannepalli) కస్తూర్బా గాంధీ (Kasturba Gandhi) పాఠశాలలో (School) విద్యార్థులు అస్వస్థతకు గురైనట్టు సమాచారం. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారట. గత మూడు రోజులుగా విద్యార్థులకు జ్వరం, జలుబు వంటి లక్షణాలు ఉన్నా హాస్టల్ అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదని, హాస్టల్ పరిసర ప్రాంతాల శుభ్రత విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహిరస్తున్నారని విద్యార్థులు వాపోతున్నారట.
ఈ ఘటనతో పాఠశాలలో గందరగోళం నెలకొంది. నేతలకు మాటలతో మాయ చేయడంపై ఉన్న శ్రద్ధ.. చేతల్లో చూపిస్తే పిల్లలకు ఇలాంటి దుస్థితి వచ్చేది కాదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారట.
Kasturba Gandhi School Student critical condition