Telugu News » Manchu Manoj: తండ్రైన టాలీవుడ్ హీరో.. స్పెషల్ అనౌన్స్‌మెంట్..!

Manchu Manoj: తండ్రైన టాలీవుడ్ హీరో.. స్పెషల్ అనౌన్స్‌మెంట్..!

ఇటీవల మౌనిక తల్లి కాబోతోందని సీమంతాన్ని వేడుకగా నిర్వహించారు. తాజాగా మౌనిక పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని మంచు లక్ష్మి(Manchu Laxmi) సోషల్ మీడియా వేదికగా స్పెషల్ అనౌన్స్‌మెంట్ చేసింది.

by Mano
Manchu Manoj: Father is a Tollywood hero.. Special announcement..!

టాలీవుడ్ యంగ్ హీరో మంచు మనోజ్(Manchu Manoj), భూమా మౌనిక(Bhuma Mounika ) రెండో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల మౌనిక తల్లి కాబోతోందని సీమంతాన్ని వేడుకగా నిర్వహించారు. తాజాగా మౌనిక పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని మంచు లక్ష్మి(Manchu Laxmi) సోషల్ మీడియా వేదికగా స్పెషల్ అనౌన్స్‌మెంట్ చేసింది.

Manchu Manoj: Father is a Tollywood hero.. Special announcement..!

మనోజ్, మౌనిక మరోసారి తల్లదండ్రులయ్యారని తెలిపింది. తమ ఇంట్లోకి దేవత వచ్చిందని తెలిపింది. అన్నగా ధైరవ్ సంతోషిస్తున్నాడని పేర్కొంది. శివయ్య ఆశీస్సులు తమ కుటుంబంపై ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నామని మంచు లక్ష్మీ ఎక్స్(x) వేదికగా పేర్కొంది. ఈ ట్వీట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

కాగా ఈ పోస్ట్‌ను మంచు మనోజ్ రీ ట్వీట్ చేశాడు. పులి ఒడిలో పడుకున్న పాపతో పాటు నలుగురం అయ్యామని చెప్పే ఓ ఏఐ పిక్ షేర్ చేశారు. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తనయుడిగా మంచు మనోజ్ తెలుగులో ఝుమ్మంది నాదం, బిందాస్, వేదం, కరెంట్ తీగ, పోటుగాడు, రాజు భాయ్, మిస్టర్ నూకయ్య, నేను మీకు తెలుసా? ఊ కొడతారా ఉలిక్కి పడతారా సినిమాల్లో నటించాడు.

ఇప్పుడు వెండితెర నుంచి బుల్లితెర మీదకు వచ్చి నవ్వులు పువ్వులు పూయించాడు. ప్రస్తుతం మనోజ్ ఉస్తార్ ర్యాంప్ ఆడిద్దాం అంటూ ఓ షోకు హోస్టుగా వ్యవహరిస్తున్నాడు. మంచు మనోజ్ 2015లో ప్రణీత రెడ్డిని వివాహం చేసుకున్నాడు. కానీ ఈ దంపతులు 2019లో విడిపోయారు. 2023లో భూమా మౌనికరెడ్డిని రెండో వివాహం చేసుకున్నాడు మనోజ్. వీరిద్దరిదీ రెండో వివాహమే. గతంలో మౌనికకు వివాహం కాగా ధైరవ్ జన్మించాడు.

 

You may also like

Leave a Comment