నందమూరి బాలకృష్ణ ఎన్నో హిట్ సినిమాల్లో నటించారు. బాలయ్య ఒకే రకమైన సినిమాల్లో కాకుండా రకరకాల కథలు ఉన్న సినిమాని ఎంపిక చేసుకునే వారు. ప్రయోగాత్మక సినిమాల్లో కూడా నటించి అందరిని మెప్పించారు బాలయ్య. పౌరాణిక సినిమాల్లో కూడా బాలయ్య అదరగొట్టేస్తుంటారు. బాలయ్య కెరియర్లో చెప్పుకోదగ్గ సినిమాలు చాలా ఉన్నాయి వాటిలో ఆదిత్య 369 కూడా ఒకటి. ఈ సినిమా అప్పట్లో రికార్డులని బ్రేక్ చేసేసింది. బాలయ్య నటా విశ్వరూపాన్ని ఈ సినిమాలో చూపించారు. బాలయ్య కెరీర్ ని ఈ సినిమా నిలబెట్టింది ఈ సినిమా టైం మిషన్ అనే కాన్సెప్ట్ తో ప్రేక్షకులు ముందుకి దర్శకుడు తీసుకువచ్చారు.
ఈ సినిమా టైటిల్ లో 369 అనే నెంబర్ ఉంటుంది అయితే ఈ సినిమా టైటిల్ వెనుక 369 నెంబర్ ఎందుకు పెట్టారు..? దానికి కారణం ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. ఒక ఇంటర్వ్యూలో బాలయ్యకి కూడా ఈ సినిమా టైటిల్ విషయంలో ఈ ప్రశ్న వచ్చింది. దానితో బాలయ్య ఆదిత్య అంటే సూర్యుడు అని ఆన్సర్ చెప్పారు. 369 అంటే అదొక స్పెషల్ నెంబర్ అని చెప్పారు. కానీ ఆ నంబర్ ఎలా వచ్చింది అర్థం ఏంటి అనేది చెప్పలేదు.
Also read:
369 అంటే పాజిటివిటీ అని అర్థం. ఇందులో మూడు అంటే మార్పు. 6 అంటే ఆరంభం. 9 అంటే విస్తరించడం అని అర్థం. అందుకని ఈ మూడు ఆరు తొమ్మది అనే నెంబర్ ని టైటిల్ లో పెట్టారు 369 అనే నెంబర్ గడియారంలో సరి సమానంగా ఉండే కాలాన్ని సూచిస్తుంది. సంఖ్యశాస్త్రం ప్రకారం కూడా ఈ నెంబర్ చాలా లక్కీ. సల్మాన్ ఖాన్ కి కూడా ఈ నెంబర్ లక్కీ నెంబర్ సల్మాన్ ఖాన్ కార్ నెంబర్ తో పాటు ఇదే నెంబర్ ని ఉపయోగిస్తారు