మెదక్ (Medak) జిల్లా నిజాంపేట (Nizampet) మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) చోటుచేసుకొంది. నిజాంపేట మండల శివారులో నేటి ఉదయం 11.30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగిందని సమాచారం. పెండ్లి బృందంతో వెళ్తున్న బస్సును లారీ ఢీకొట్టింది. దీంతో బస్సులో ఉన్న ప్రయాణికులకు తీవ్ర గాయాలు అయినట్లు తెలుస్తోంది.

వెంటనే సిద్దిపేటలో ఉన్న ఏరియా ఆసుపత్రి సూపరిండెంట్ తో సైతం ఫోన్ లో మాట్లాడారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలందించాలని కోరారు. అవసరమైతే హైద్రాబాద్ లోని ఆసుపత్రికి తరలించాలని పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వాళ్ళకు అన్ని విధాలుగా ఆదుకుంటామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే హామీ ఇచ్చారు..