మెక్సికో (Mexico) దక్షిణ రాష్ట్రమైన గెరెరో (Guerrero)లో దారుణం చోటు చేసుకొంది.. రెండు క్రిమినల్ ముఠాల మధ్య జరిగిన ఘర్షణలో 12 మంది మరణించారని సమాచారం. ఈ ఘటనపై ఆ దేశ అధ్యక్షుడు ఆండ్రెస్ మాన్యుయెల్ లోపెజ్ ఒబ్రాడోర్ (Andres Manuel Lopez Obrador) స్పందించారు. ఇలా జరగడం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని పేర్కొన్నారు. ఇటువంటి చర్యలను ఉపేక్షించేంది లేదని హెచ్చరించారు.
క్రిమినల్ ముఠాల మధ్య ఘర్షణ జరగడంపై క్షేత్రస్థాయిలో విచారణ చేస్తున్నట్లు వెల్లడించారు. తొందరలోనే నిందితులను పట్టుకుంటామని అధ్యక్షుడు ఒబ్రాడోర్ అన్నారు. ఇక, మెక్సికో నగరంలోని నేషనల్ ప్యాలెస్ (National Palace)లో బుధవారం నాడు జరిగిన ప్రెస్ మీట్ లో పాల్గొన్న లోపెజ్ ఒబ్రాడోర్ విలేకరులతో మాట్లాడుతూ.. ఈ ఘటనపై మంగళవారం నాడు విచారణ ప్రారంభమైందని తెలిపారు.
ఇప్పటికే దేశ భద్రతా దళాలకు చెందిన నేషనల్ గార్డ్ సైనికులు సంఘటన స్థలనాకి చేరుకొన్నారు. ఈ ఘోరమైన ఘర్షణపై అధికారులు తదుపరి విచారణలో మరిన్ని వివరాలను అందజేస్తారని అధ్యక్షుడు ఒబ్రాడోర్ పేర్కొన్నారు. మరోవైపు అమెరికాలోని టెక్సాస్ సరిహద్దు (Texas Border) సమీపంలో జరిగిన కాల్పుల్లో 12 మంది సాయుధులను మెక్సికో (Mexico) సైన్యం రెండు రోజుల క్రితం మట్టుబెట్టిన విషయం తెలిసిందే.. ఇదిలా ఉండగా మెక్సికోలో గ్యాంగ్ వార్ జరగడం సర్వసాధారణంగా మారిపోయింది..