Telugu News » Jupally Krishna Rao : కేసీఆర్… పగటి కలలు…!

Jupally Krishna Rao : కేసీఆర్… పగటి కలలు…!

కృష్ణా బేసిన్ ప్రాజెక్ట్‌ల‌పై కేసీఆర్‌ది స‌వ‌తి తల్లి ప్రేమ‌ అని ఫైర్ అయ్యారు.

by Ramu
minister jupally krishna rao counter to kcrs comments
కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో ఎక్కడ‌ అవీనితి బ‌య‌ట‌ప‌డుతుందోననే భ‌యంతోనే కేసీఆర్ (KCR) డ్రామా చేస్తున్నారని మంత్రి జూపల్లి కృష్ణారావు (Jupally Krishna Rao) అన్నారు. కృష్ణా బేసిన్ ప్రాజెక్ట్‌ల‌పై కేసీఆర్‌ది స‌వ‌తి తల్లి ప్రేమ‌ అని ఫైర్ అయ్యారు. తెలంగాణలో డ‌బుల్ స్పీడ్‌తో అధికారంలోకి వ‌స్తామ‌ని కేసీఆర్ ప‌గ‌టి క‌లలు కంటున్నారని ఎద్దేవా చేశారు.
minister jupally krishna rao counter to kcrs comments
కాళేశ్వరం, మేడిగ‌డ్డ, ఇత‌ర సాగునీటి ప్రాజెక్ట్‌ల‌తో పాటు మిష‌న్ భ‌గీర‌థ‌, చీక‌టి క‌రెంట్ ఒప్పందాలు, భూదందాలను అన్నింటిని కాంగ్రెస్ ప్రభుత్వం బ‌య‌ట‌పెడ్తోందన్నారు. క‌మీష‌న్ల కోస‌మే కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను నిర్మించారని ఆరోపణలు గుప్పించారు. బీఆర్ఎస్ పాలన డొంక కదిలితే కొన్ని వేల కోట్ల అవినీతి సొమ్ము బయటకు వస్తుందని చెప్పారు.
మేడిగడ్డ ప‌రిశీల‌న‌లో నాణ‌త్య డొల్లత‌నం బ‌య‌ట‌ప‌డిందని చెప్పారు. నాణ్యత‌ను గాలికి వ‌దిలేసి హ‌డావుడిగా ప్రాజెక్ట్‌ల‌ను పూర్తి చేశారని నిప్పులు చెరిగారు. వేల కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని నీటి పాలు చేశారని ధ్వజమెత్తారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.
పక్కనే కృష్ణా ఉన్నా.. ఫలితం లేకపాయే అనే పాట రాసినని కేసీఆర్ చెప్పుకుంటున్నారని… కృష్ణా పరిహాక ప్రాంత ప్రజ‌ల‌కు అన్యాయం చేసిన మాట వాస్తవం కాదా? అని నిలదీశారు.  గ‌త తొమ్మిదిన్నర ఏళ్లు ప్రజ‌ల ప‌క్షాన కాంగ్రెస్ పోరాడటంతోనే పార్టీకి ప‌ట్టం క‌ట్టారని వెల్లడించారు. ప్రజ‌ల దృష్టి మ‌ర‌ల్చేందుకే కేసీఆర్ న‌ల్గొండ స‌భ‌ అని దుయ్యబట్టారు.
నల్లగొండ సభలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్‌కు అధికారం క‌లేననన్నారు. కేసీఆర్ ప్రజా తీర్పును అవ‌మానిస్తున్నారంటూ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలిచ్చే బర్రె ఏదో.. దున్నపోతు ఏదో తెలంగాణ ప్రజ‌ల‌కు బాగా తెలుసని స్పష్టం చేశారు. అందుకే బీఆర్ఎస్ అరాచక పాలనకు ప్రజ‌లు చ‌ర‌మ‌గీతం పాడారన్నారు.

You may also like

Leave a Comment