Telugu News » KTR : నేను సీఎం కావాలంటే.. మోడీ ఎన్ఓసీ అవసరం లేదు!

KTR : నేను సీఎం కావాలంటే.. మోడీ ఎన్ఓసీ అవసరం లేదు!

కాంగ్రెస్ వాళ్ళకి ఒక్కసారి కాదు 11 సార్లు ఛాన్స్ ఇచ్చినా ఏం చేశారని కేటీఆర్ ప్రశ్నించారు. వారి హయాంలో తాగు, సాగు నీరు అందలేదని అన్నారు. అదే, కేసీఆర్ పాలనలో ఒక్క సంవత్సరం కూడా కరువు కాటకాలు లేవని వివరించారు.

by admin
minister ktr says dalith bandhu should reach for every dalith family

తెలంగాణ (Telangana) లో అభివృద్ధి జరిగిందని నమ్మితేనే ఓట్లు వేయండని అన్నారు మంత్రి కేటీఆర్ (KTR). నిర్మ‌ల్ (Nirmal) నియోజ‌క‌వ‌ర్గంలో రూ.714 కోట్ల‌తో చేపట్టిన కాళేశ్వరం (Kaleswaram) ప్యాకేజీ-27ని ప్రారంభించారు. అలాగే, పోచంపాడ్ వ‌ద్ద రూ.300 కోట్ల‌తో నిర్మించే పామాయిల్ ప‌రిశ్ర‌మకు శంకుస్థాప‌న చేశారు. ఈ సంద‌ర్భంగా అక్క‌డ ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో మంత్రి కేటీఆర్ పాల్గొని ప్ర‌సంగించారు. అభివృద్ధి అంటే తెలంగాణ రాష్ట్రాన్ని చూసి నేర్చుకోవాలని తెలిపారు.

minister ktr says dalith bandhu should reach for every dalith family

కాంగ్రెస్ వాళ్ళకి ఒక్కసారి కాదు 11 సార్లు ఛాన్స్ ఇచ్చినా ఏం చేశారని కేటీఆర్ ప్రశ్నించారు. వారి హయాంలో తాగు, సాగు నీరు అందలేదని అన్నారు. అదే, కేసీఆర్ పాలనలో ఒక్క సంవత్సరం కూడా కరువు కాటకాలు లేవని వివరించారు. రాష్ట్రం సుభిక్షంగా, సస్యశ్యామలంగా ఉందని అన్నారు. తెలంగాణలో 17 ప్రాజెక్టులు నిర్మించామని తెలిపారు కేటీఆర్. తొమ్మిదిన్నరేళ్లలో ఏం చేశామో చెప్పగలిగే స్థితిలో ఉన్నామని.. అదే కాంగ్రెస్​ చరిత్రలో ఏం చేశారో చెప్పే స్థితిలో ఉందా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ సచ్చిన పాము అంటూ విమర్శించారు.

జిల్లాకొక మెడికల్​ కాలేజీ వస్తుందని ఎప్పుడైనా అనుకున్నామా.. కానీ ఇప్పుడు సుమారు 23 మెడికల్​ కళాశాలలు వచ్చాయని తెలిపారు కేటీఆర్. ఎంత పెద్ద జబ్బు అయినా.. జిల్లా ఆస్పత్రుల్లోనే చికిత్స అందుతోందని చెప్పారు. ఆరున్నర లక్షల మంది విద్యార్థులకు గురుకులాల్లో విద్య అందిస్తున్నామని వివరించారు. ఒక‌ప్పుడు ఎస్సారెస్పీ ఎండిపోయి ఆగ‌మ‌య్యేదని.. రివ‌ర్స్ పంపింగ్ చేప‌ట్టిన త‌ర్వాత నిండుకుండ‌లా మారిందన్నారు. ఇది కేసీఆర్ వ‌ల్లే సాధ్య‌మైందని చెప్పారు.

‘‘సాగునీటి విష‌యంలో క‌ష్టాలు త‌ప్పాయి.. కాబ‌ట్టి ఓటు వేసే ముందు రైతులు ఆలోచించాలి. 24 గంట‌ల‌ క‌రెంట్ వ‌స్తుందంటే.. రైతుబంధు తీసుకొని ధైర్యంగా వ్య‌వ‌సాయం చేస్తున్నాడంటే అందుకు కేసీఆర్. రైతు బీమాతో రైతుల కుటంబాల‌ను ఆదుకుంటున్నాం. న‌రేంద్ర మోడీ కొన్నా కొన‌క‌పోయినా.. న‌ష్ట‌మొచ్చినా కేసీఆర్ భ‌రిస్తాడ‌నే విశ్వాసం, న‌మ్మ‌కం రైతుల‌కు ఏర్ప‌డింది’’ అని అన్నారు కేటీఆర్.

ఇక, బీజేపీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గాలి మోటారు మీద వచ్చిన మోడీ గాలి మాటలు మాట్లాడి వెళ్లారని మండిపడ్డారు. తాము ఢిల్లీ గులాంలం కాదన్నారు. ‘‘సిలిండర్ ధర 12 వందలు చేసి ఇక్కడ చెప్పితే ఎట్లా?. బండి సంజయ్ మోడీ దేవుడు అంటారు. ఎవ్వరికి దేవుడో చెప్పడం లేదు. పిచ్చోళ్లకు ఓట్లు వేద్దామా? 15 లక్షలు వచ్చినవాళ్లు బీజేపీకి ఓటు వేయండి. రైతు బంధు వచ్చిన వాళ్లు మాకు ఓటు వేయండి. ఒక్క రైలుకు అన్నిచోట్లా జెండాలు ఉపడం ఏంటి? నేను సీఎం కావాలంటే మోడీ ఎన్ఓసీ అవసరం లేదు’’ అని వ్యాఖ్యానించారు కేటీఆర్.

You may also like

Leave a Comment