Telugu News » KTR : కార్మికులను కేసీఆర్ సర్కార్ కడుపులో పెట్టుకుని చూసుకుంటోంది…!

KTR : కార్మికులను కేసీఆర్ సర్కార్ కడుపులో పెట్టుకుని చూసుకుంటోంది…!

ప్రతి దళిత కుటుంబానికి లాభం చేకూర్చే విధంగా దళితబంధు (Dalitha Bandhu)ను అందజేస్తామని మంత్రి కేటీఆర్‌ తెలిపారు.

by Ramu
minister ktr says dalith bandhu should reach for every dalith family

కార్మికులను కేసీఆర్ (KCR) ప్రభుత్వం కడుపులో పెట్టుకుని చూసుకుంటోందని మంత్రి కేటీఆర్ (KTR) అన్నారు. దళితుల ఉద్ధరణ కోసమే ప్రభుత్వం దళిత బంధు పథకాన్ని ప్రవేశ పెట్టిందని మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రతి దళిత కుటుంబానికి లాభం చేకూర్చే విధంగా దళితబంధు (Dalitha Bandhu)ను అందజేస్తామని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. దమ్మున్న నాయకులతోనే ఇది సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు.

minister ktr says dalith bandhu should reach for every dalith family

హైదరాబాద్‌ హుస్సేన్‌సాగర్‌ తీరంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద మురుగు వ్యర్థాల రవాణా వాహనాలను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ….. మహాత్మ గాంధీ ఆలోచనలతో స్వచ్ఛ హైదరాబాద్‌, పట్టణ, పల్లె ప్రగతి కార్యక్రమాలను చేపడుతున్నామని తెలిపారు. గాంధీ జయంతి సందర్భంగా 162 సిల్ట్‌ కార్టింగ్‌ వాహనాలను అందించడం చాలా సంతోషంగా వుందన్నారు.

రూ. కోటికి పైగా నిధులు ఖర్చు చేసి వీటిని కొనుగోలు చేశామన్నారు. ప్రతి వాహనానికి జలమండలి పని కల్పిస్తుందని వెల్లడించారు. ఈ వాహనాలను ప్రతి మూడు నెలలకు ఒకసారి జల మండలి తనిఖీ చేస్తుందని చెప్పారు. మహాత్మ గాంధీని ఆదర్శంగా తీసుకుని సీఎం కేసీఆర్‌ పరిపాలిస్తున్నారని అన్నారు. దేశంలో ఎవరూ చెప్పని విధంగా సఫాయి అన్న నీకు సలాం అని కేసీఆర్‌ చెప్పారని మంత్రి గుర్తు చేశారు.

శాంతియుత పోరాటం చేసి రాష్ట్రాన్ని కేసీఆర్‌ సాధించారని చెప్పారు. కొంత మంది ఢిల్లీలో గాంధీజీ ఫొటోలకు పోజులు ఇవ్వడం తప్ప ఆయన ఆశయాలను ఆచరించరన్నారు. దళితబంధు అందాల్సిన వారు ఇంకా లక్షల్లో ఉన్నారని వెల్లడించారు. భవిష్యత్‌లో అర్హులైన అందరికీ దళితబంధు సాయం అందిస్తామని చెప్పారు.

You may also like

Leave a Comment