Telugu News » KTR: అభివృద్ధి విషయంలో న్యూయార్క్‌తో హైదరాబాద్ పోటీ పడుతోంది…!

KTR: అభివృద్ధి విషయంలో న్యూయార్క్‌తో హైదరాబాద్ పోటీ పడుతోంది…!

హైదరాబాద్ నగరం ఎంతో అభివృద్ధి చెందిందని సూపర్ స్టార్ రజనీకాంత్‌ కొనియాడారని మంత్రి గుర్తు చేశారు.

by Ramu
minister ktr speech on telangana development

అభివృద్ధి విషయంలో న్యూయార్క్‌ (Newyork)తో హైదరాబాద్ (Hyderabad) పోటీ పడుతోందని మంత్రి కేటీఆర్ (KTR) అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్, తాగునీటి సమస్య తీవ్రంగా ఉండేదని మంత్రి గుర్తు చేశారు. కానీ ఇప్పుడు దేశంలోనే ఇప్పుడు నిరంతర విద్యుత్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని తెలిపారు. డిసెంబర్ 30న మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

minister ktr speech on telangana development

జేఆర్సి కన్వెన్షన్ సెంటర్‌లో రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్‌ ప్రతినిధుల సమావేశంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ…. మీకు ఎలాంటి సమస్యలు వున్నా వాటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. రాబోయే రోజుల్లో నగరంలో ట్రాఫిక్ సమస్యను పూర్తిగా తగ్గిస్తామని వెల్లడించారు. డిసెంబర్ 3న మళ్ళీ తామే అధికారంలోకి వస్తామన్నారు.

రాబోయే ఐదేండ్లలో నగరానికి 24 గంటల మంచినీటి సరఫరా అందిస్తామన్నారు. హైదరాబాద్ నగరం ఎంతో అభివృద్ధి చెందిందని సూపర్ స్టార్ రజనీకాంత్‌ కొనియాడారని మంత్రి గుర్తు చేశారు. గత పదేండ్లలో నగరంలో 36 ఫ్లై ఓవర్లను నిర్మించామని చెప్పారు. 39 చెరువులను పునరుద్దరించామన్నారు.

మిషన్ భగీరథ కార్యక్రమం వల్ల హైదరాబాద్ నగరంలో తాగునీటి సమస్య తీరిందన్నారు. హైదరాబాద్ లో పాతబస్తీని కాపాడుకుందామని ప్రజలకు పిలుపునిచ్చారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు నగరంలో ఎన్నో అనుమానాలు ఉండేవని పేర్కొన్నారు. కానీ ఈ తొమిదిన్నర ఏళ్లలో అంచెలంచెలుగా అన్నింటినీ చేసి చూపించామన్నారు.

కరోనా రెండేండ్లు మినహా మిగితా ఆరున్నరేండ్ల పాటు తాము పని చేసి, అభివృద్ది చూపించామని వెల్లడించారు. రాబోయే రోజుల్లో మెట్రోను మరింత విస్తరిస్తామన్నారు. ట్రాఫిక్ తగ్గాలంటే మెట్రో సేవలు పెరగాలని చెప్పారు. జీహెచ్ఎంసీకి ఒక కమిషనర్ సరిపోరన్నారు. రాబోయే ప్రభుత్వంలో జీహెచ్ఎంసీకి మరో ఇద్దరు స్పెషల్ కమిషనర్ లను నియమిస్తామన్నారు. అందులో ఒకరు పచ్చదనం, పార్కుల పరిరక్షణకు, మరొకరు చెరువుల పరిరక్షణ చూసే విధంగా నియామకాలు ఉంటాయన్నారు.

You may also like

Leave a Comment