పార్లమెంట్ ఎన్నికల (Parliament Elections) తర్వాత పొంగులేటి శ్రీనివాస రెడ్డి (Ponguleti Srinivasa Reddy) సీఎం అంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.. అయితే ఈ ప్రచారం పై స్పందించిన మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు.. పళ్ళు ఉన్న చెట్టుకే రాళ్ల దెబ్బలు తగులుతాయని.. తన దగ్గర పండ్లు ఉన్నాయన్నారు. సీఎం వెంట రోజు ఉంటే నంబర్ టూ ఎలా అవుతానని ప్రశ్నించారు.
నేను సీఎం కావాలంటే హైకమాండ్ కూడా నాలో కొన్ని ఈక్వేషన్స్ చూస్తుంది కదా !.. అని క్వచ్చన్ వేశారు.. మీడియాతో చిట్ చాట్ సందర్భంగా మంత్రి పొంగులేటి ఆసక్తికరంగా మాట్లాడారు.. తనకు సీఎం కావాలన్న ఆశలేదని తెలిపారు. కానీ కొంత మంది నేతలు పనిగట్టుకొని అబద్ధపు ప్రచారాలు చేస్తున్నట్లు ఆరోపించారు.. తెలంగాణకు న్యాయం చేయడం నచ్చిని కొందరు నేను బీజేపీలోకి వెళ్తున్నారనే పుకార్లకు తెరతీశారని మండిపడ్డారు..
తమ ప్రభుత్వంకు ఫోన్ ట్యాపింగ్ చేయవలసిన అవసరం లేదని.. అలాంటి పనులు చేసే వారు ఇంట్లో కూర్చున్నారని ఆరోపించారు.. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ (Congress) డబుల్ డిజిట్ ఎంపీ సీట్లు గెలవబోతుందని మంత్రి పొంగులేటి జోస్యం చెప్పారు. బీఆర్ఎస్ మీద మేము కక్షపూరితంగా కేసులు పెడుతున్నామని ఆరోపణలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్న మంత్రి.. వారి బుద్ధిని మాపై రుద్దాడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు..
గత ప్రభుత్వంలో అధికార దుర్వినియోగానికి పాల్పడింది ఎవరో ప్రజలకు తెలుసని వివరించారు.. అదేవిధంగా జలాశయంలో నీరు లేకపోవడం, పంటలు ఎండిపోవడం వంటి ఫొటోలు.. వీడియోలు పెట్టి కొన్ని మీడియా సంస్థలు కాంగ్రెస్ ప్రభుత్వం పై నిందలు వెసే ప్రయత్నం చేస్తున్నాయని మంత్రి మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది డిసెంబర్ లో..రాబోయే ఎండాకాలం దృష్టిలో పెట్టుకొని నీటి నిల్వలు ఉంచాల్సిన బాధ్యత గత ప్రభుత్వంపై ఉంది.. కానీ వారు తమ భాద్యత విస్మరించి మాపై రాళ్ళేయడం తగదని సూచించారు..
కాళేశ్వరం ఫలితం ఎవరికి దక్కిందో అందరికి తెలిసిందే అని విమర్శించిన పొంగులేటి.. ప్రస్తుత పరిస్థితుల్లో బీఆర్ఎస్ రెండు ఎంపీ సీట్లు గెలిస్తే గొప్ప అని దెప్పి పొడిచారు.. ఇతర పార్టీల నుంచి మా పార్టీలోకి రమ్మని మేం ఎవరిని అడగటం లేదు. వారికై వారు స్వచ్చందంగా వస్తున్నారన్నారు. మేం గేట్లు ఎత్తలేదు. ఎత్తితే వరద ఆగదని మంత్రి తెలిపారు. గత పాలకుల అవినీతి మీద పోరాడుతూనే.. డిస్టర్బ్ అయిన వ్యవస్థను దారిలో పెడుతున్నామని పొంగులేటి వెల్లడించారు.
అదేవిధంగా చెప్పినట్టే ఐదు ఎకరాలకు రైతు బంధు ఇస్తున్నామని పేర్కొన్నారు.. జీతాల చెల్లించడంలో కొంత ఆలస్యం అయిన మాట వాస్తవమేనని కానీ ఈ సమస్య ఎప్పటికీ ఉండదని వివరించారు. రాబోయే ఎన్నికల్లో 14స్థానాలలో గెలుపు గ్యారంటీ అని ధీమా వ్యక్తం చేశారు.. ధరణిలో జరిగిన అవినీతిని బయటకు తీస్తామని తెలిపిన మంత్రి.. గత ప్రభుత్వ అవినీతి సొమ్ము అంతా కక్కిస్తామన్నారు.. రిజిస్ట్రేషన్ శాఖను ప్రక్షాళన చేస్తామని తెలిపారు. భూమాత పోర్టల్ ను తీసుకొస్తామన్నారు.. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పాలన చేయాలని భావించాం.. ఈ ఉద్దేశ్యంతో ప్రధానిని కలిస్తే పనికిమాలిన ఆరోపణలు చేస్తున్నారని పొంగులేటి శ్రీనివాస రెడ్డి మండిపడ్డారు..