తెలంగాణ (Telangana)లో పార్లమెంట్ ఎన్నికల వార్ ఇప్పటికే మొదలైంది. ప్రధాన పార్టీ నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకొంటున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి.. ఈ క్రమంలో బీజేపీపై రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు.. బలహీన వర్గాల కోసం ఆలోచించే ప్రధాని అని చెప్పుకునే మోడీ (Modi), 14 అంశాల్లో ఒక్కటి కూడా బలహీన వర్గాలకు సంబంధించిన అంశం పెట్టకపోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు..
ఈ విషయాన్ని దేశంలో ఉన్నా బలహీన వర్గాలంతా గమనించాలని కోరారు.. కాంగ్రెస్ కి ఎన్నికల్లో అండగా నిలబడాలని పిలుపునిచ్చారు. అలాగే కాంగ్రెస్ పార్టీ పాంచ్ న్యాయ్ లో బలహీన వర్గాలకు సంబంధించిన అంశాలు చేర్చామని పేర్కొన్న పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar).. బలహీన వర్గాలు ఆలోచించండని సూచించారు.. 10 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న వారు మిగతా వర్గాలకు రిజర్వేషన్లు ఇవ్వడానికి వ్యతిరేకం కాదన్నారు.
మరోవైపు కాంగ్రెస్ కుల గణన సర్వే చేయడానికి సిద్ధంగా ఉందని తెలిపిన మంత్రి.. బీజేపీ (BJP) మాత్రం సుప్రీం కోర్టులో అఫిడవిట్ ఇచ్చి కుల గణనకి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుందని ఆరోపించారు.. పూర్తిగా వ్యాపార వర్గాల పార్టీగా బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తుందని విమర్శించారు.. బీజేపీ మేనిఫెస్టో ని.. కాంగ్రెస్ (Congress) మేనిఫెస్టో ని చదివి బీసీ లు నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రజలకు సూచించారు..
అలాగే కాంగ్రెస్ అనేక కులాలకు కార్పొరేషన్లు ఇచ్చి ఆర్థిక పరిపుష్టి కలిగే విధంగా చర్యలు తీసుకుంటుందని.. భవిష్యత్ లో బలహీన వర్గాలకు న్యాయం చేసే విధంగా మీ బిడ్డ మీ పక్షానా నిల్చుంటాడని పొన్నం తెలిపారు.. ఎన్నికల్లో బలహీన వర్గాలు కాంగ్రెస్ వైపు ఉండాలని కోరిన పొన్నం.. బలహీన వర్గాల పట్ల బీజేపీకి ఉన్న వ్యతిరేకతని దృష్టిలో పెట్టుకొని ఓటు ఉపయోగించుకోవాలని సూచించారు..