రోజా, ఏపీ మంత్రి
చంద్రబాబు (Chandrababu) తప్పుచేసి సాక్ష్యాలతో దొరికిపోయారు. ఆయన జైలుకెళ్లడంతో టీడీపీ (TDP) నేతలకు పిచ్చెక్కింది. మా నాయకుడు తప్పు చేయలేదని ప్రూవ్ చేసుకోకుండా మా మీద పడి ఏడిస్తే ఏం లాభం. చంద్రబాబు కోసం ఢిల్లీ నుంచి పెద్ద పెద్ద లాయర్లు వచ్చారు. ఆయన తప్పు చేయకపోతే ఎందుకు బయటకు తీసుకురాలేకపోతున్నారు. టీడీపీ ఫెయిల్యూర్ ను డైవర్ట్ చేయడానికి నన్ను టార్గెట్ చేశారు.
మాజీ మంత్రిగా చేసిన బండారు సత్యనారాయణ (Bandaru Satyanarayana) చాలా నీచంగా మాట్లాడారు. నాకు ఊహ తెలిసినంత వరకూ ఎవరూ ఇంతలా ఒక మహిళ గురించి మాట్లాడలేదు. తన నియోజకవర్గంలో ఉన్న మహిళలకు.. తన ఇంట్లో ఉన్న మహిళలకు బండారు ఎలాంటి గౌరవమిస్తారో అర్థమైంది. మహిళల పట్ల ఆయనకు ఉన్న సంస్కారమేంటో అందరికీ తెలిసింది. మంత్రిగా ఉన్న నన్ను అంటే తప్పించుకు తిరగొచ్చని అనుకుంటున్నారు.
బండారు వంటి మగవాళ్లకు బుద్ధి చెప్పడానికే నేను పోరాటం చేస్తున్నా. అరెస్ట్ చేసి బెయిల్ వస్తే తప్పు చేయనట్లు కాదు. బండారు చేసిన వ్యాఖ్యల వల్ల మేం చాలా అవమానపడ్డాం. చట్టాల్లో మార్పు రావాలి. బండారు సత్యనారాయణ వంటి చీడ పురుగులను ఏరిపారేయాలి. ఏ మహిళను కించ పరచాలన్నా భయపడేలా ఉండాలి. మహిళ మీద నింద వేస్తే చచ్చే వరకూ అవమానం భరించాలా?
నాపై బురద జల్లాలని చూసినా నేను పోరాడుతున్నా. సామాన్య మహిళకు ఇలాంటి పరిస్థితి వస్తే ఏంటి? న్యాయపరంగా పోరాడుతా. దీన్ని అంత తేలిగ్గా వదలను. సుప్రీంకోర్టుకు వెళ్తా. టీడీపీ, జనసేన దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాయి. మహిళలను కించపరిచేలా మాట్లాడుతున్న వారు చరిత్రహీనులుగా మిగిలిపోతారు.