టీడీపీ, జనసేన అధినేతలు చంద్రబాబు(Chandrababu), పవన్ కల్యాణ్(Pawan kalyan)లపై మంత్రి రోజా(Minister Roja) కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుపతిలో నిర్వహించిన భోగి సంబురాల్లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా భోగి మంటల్లో కొన్ని పాత వస్తువులు కాల్చారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు.
చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఎన్నిసార్లు కలిసినా.. జోగి జోగి రాసుకుంటే బూడిది రాలినట్లే అని మంత్రి రోజా సెటైర్లు విసిరారు. ప్యాకేజీల కోసం పవన్ కల్యాణ్ పార్టీలు మార్చుతాడని ఎద్దేవా చేశారు. తన వ్యక్తిగత అవసరాల కోసం అభిమానులను వాడుకుంటున్నారని ఆరోపించారు.
జనసేన కార్యకర్తలను కూలీలుగా మార్చారని రోజా మండిపడ్డారు. ఏపీకి మరోసారి జగనే ముఖ్యమంత్రి కావాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. పవన్‌కల్యాణ్‌తో కలిసి చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు వైసీపీ వైపే ఉన్నారని రోజా స్పష్టం చేశారు.
మరోవైపు, తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబురాలు అంబరాన్ని అంటాయి. ఇప్పటికే జనం వివిధ ప్రాంతాల నుంచి సొంతూళ్లకు చేరుకుంటున్నారు. ఆదివారం తెల్లవారుజాము నుంచే ఇళ్ల ఎదుట రంగురంగుల ముగ్గులు వేసి మధ్యలో గొబ్బెమ్మలు పెట్టి ఘనంగా జరుపుకుంటున్నారు.