ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా చత్తీస్‌గఢ్ (Chhattisgarh), మిజోరాం (Mizoram)లో ఎన్నికలు నిర్వహించారు. మిజోరాంలో మొత్తం 40 అసెంబ్లీ స్థానాలకు ఈ రోజు పోలింగ్ నిర్వహించారు. సాయంత్రం 5 గంటల వరకు 77.04 శాతం పోలింగ్ నమోదైంది. సాయంత్రం 5 గంటల వరకు 77.04 శాతం ఓటింగ్ నమోదైనట్టు ఎన్నికల సంఘం వెల్లడించింది.
సెర్జిప్ జిల్లాలో అత్యధికంగా 83.96 శాతం ఓటింగ్ నమోదైనట్టు పేర్కొంది. సెర్చిఫ్ తర్వాత మమిత్ 83.42 శాతం, నహతియాల్ 82.62 శాతం, కవజవాల్ 82.39, కొలాసిబ్‌లో 80.13 శాతం ఓటింగ్ నమోదైనట్టు తెలిపింది. ఇక ఐజ్వాల్ జిల్లాలో అత్యల్ప ఓటింగ్ నమోదైనట్టు పేర్కొంది. జిల్లాలో 73.09 శాతం ఓటింగ్ నమోదైనట్టు ప్రకటించింది.
దక్షిణ మిజోరాంలోని సియాహలో అత్యల్పంగా 76.41 శాతం, సైత్వాల్ 75.12 శాతం నమోదైనట్టు అధికారులు చెప్పారు. మరోవైపు నక్సలైట్ల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న బస్తర్ జిల్లాతో సహా మొత్తం 20 అసెంబ్లీ స్థానాలకు ఈ రోజు పోలింగ్ నిర్వహించారు. పోలింగ్ నేపథ్యంలో ఆయా జిల్లాల్లో భారీ బందోబస్తును పోలీసులు ఏర్పాటు చేశారు.
పోలింగ్ సందర్భంగా హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. సుక్మా జిల్లాల్లో నక్సలైట్లు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో నలుగురు భద్రతా సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. ఖైరగఢ్-చుయుఖదాస్-చౌకిలో అత్యధికంగా 76 శాతం పోలింగ్ నమోదైంది. బిజాపూర్‌లో అత్యల్పంగా 40.98 శాతం, ఉత్తర్ బస్తర్ కాంకెర్లో 75.71, కొండగావ్‌లో 75.35, రాజ్‌నంద్‌గావ్‌లో 75.1 శాతం, బస్తర్ (జలంధర్)లో 72.41 శాతం పోలింగ్ నమోదైంది.