తమిళనాడు(Tamil Nadu)లో చైనా(China) వివాదం రోజురోజుకూ ముదురుతోంది. ఇటీవల తమిళనాడు కులశేఖరపట్టణంలో ఇస్రో కొత్త స్పేస్‌పోర్టు(Spaceport) ఏర్పాటు చేసింది. దీనిని పురస్కరించుకుని, అధికార డీఎంకే(DMK) ఓ ప్రకటన విడుదల చేసింది. ఇందులో ఇస్రోకు అభినందనలు తెలియజేస్తూ.. భారత రాకెట్‌పై చైనా జెండాను పెట్టింది. దీంతో ఒక్కసారిగా వివాదం రాజుకుంది.
మరోవైపు బీజేపీ శుక్రవారం సీఎం ఎంకే స్టాలిన్‌కు చైనా భాషలో పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది. దీంతో మరోసారి ఈ రెండు పార్టీల మధ్య తీవ్రస్థాయిలో వివాదం చెలరేగింది. “ తమిళనాడు బీజేపీ తరుపున, మా గౌరవనీయులైన సీఎం ఎంకే స్టాలిన్‌కు ఆయనకు ఇష్టమైన భాషలో పుట్టిన రోజు శుభాకాంక్షలు” అంటూ ట్వీట్ చేసింది.
అయితే, డీఎంకే పార్టీ.. కేంద్ర పథకాలపై కూడా తమ స్టిక్కర్లను అంటించుకుంటోందని బీజేపీ మండిపడుతోంది. అయితే, ఈ చైనా జెండా విషయంలో డిజైనర్ పొరపాటు ఉందని, దీంట్లో డీఎంకేకు ఎలాంటి రహస్య ఉద్దేశాలు లేవని ఆ పార్టీ సర్దిచెప్పే ప్రయత్నం చేస్తోంది. అదేవిధంగా డీఎంకే మంత్రి అనిత మాట్లాడుతూ.. రాధాకృష్ణన్ ఇస్రో ప్రకటనపై బీజేపీ సెటైర్లు వేస్తోందన్నారు.
ఈ ప్రకటనలో చిన్న పొరపాటు జరిగిందని అనిత తెలిపారు. మాకు వేరే ఉద్దేశ్యం లేదు.. మా హృదయాలల్లో భారతదేశంపై ప్రేమ మాత్రమే ఉంది. అఖండ భారతానికి డీఎంకే కట్టుబడి ఉందని ఆమె స్పష్టం చేసింది. అయితే. ఈ ఘటనపై ప్రధాని మోడీ సీఎం స్టాలిన్, డీఎంకేలను ఉద్దేశిస్తూ.. వారు భారత పురోగతిని కూడా చూడలేకపోతున్నారని తెలిపారు. చైనా జపం చేస్తున్నారంటూ ఆయన మండిపడ్డారు.