Telugu News » Kavitha : తెలంగాణను ప్రధాని ఎందుకు విస్మరించారు…. ఎమ్మెల్సీ కవిత సూటి ప్రశ్న…!

Kavitha : తెలంగాణను ప్రధాని ఎందుకు విస్మరించారు…. ఎమ్మెల్సీ కవిత సూటి ప్రశ్న…!

మధ్య ప్రదేశ్‌కు రూ. 42 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులను కేటాయించిన ప్రధాని తెలంగాణను ఎందుకు విస్మరించారని ఆమె నిలదీశారు.

by Ramu
mlc kavitha fire on congress and bjp

మహిళా బిల్లు (Woman Reservation Bill) ఆమోదం పొంది ఇతర దేశాల సరసన భారత్ (India) నిలిచిందంటే దానికి బీఆర్ఎస్ (BRS) పార్టీనే కారణమని ఎమ్మెల్సీ కవిత అన్నారు. దేశంలో మహిళా రిజర్వేషన్లను వెంటనే అమలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. మధ్య ప్రదేశ్‌కు రూ. 42 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులను కేటాయించిన ప్రధాని తెలంగాణను ఎందుకు విస్మరించారని ఆమె నిలదీశారు.

mlc kavitha fire on congress and bjp

కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించడం, నిజామాబాద్ లో పసుపు ఏర్పాటు విషయంలో ప్రధాని తన నిర్ణయాన్ని ప్రకటించాలని ఆమె డిమాండ్ చేశారు. ప్రధాని మోడీ తెలంగాణ పర్యటనకు వచ్చే ముందే రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేయాలన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం తర్వాత మొదటి సారిగా నిజామాబాద్ జిల్లాకు వచ్చారు.

ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ….. పార్లమెంట్ లో మహిళా బిల్లును ప్రవేశ పెట్టడం మరిచిపోయిందన్నారు. కానీ వాళ్లను బీఆర్ఎస్ నిద్రలేపిందన్నారు. ఈ బిల్లుపై కాంగ్రెస్ తప్పనిసరిగా మాట్లాడాల్సిన పరిస్థితిని బీఆర్ఎస్ తీసుకు వచ్చిందన్నారు. ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని కాంగ్రెస్ ఇప్పుడు మాట్లాడుతోదని ఆమె ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ కు ఆ ఆలోచన ఉండి వుంటే రెండు దశాబ్దాల క్రితమే బీసీ, ఎస్సీ, ఎస్టీలకు న్యాయం జరిగి వుండేదన్నారు.

గత పదేండ్ల కాలంలో ప్రజా ఆశీర్వాదంతో తెలంగాణలో బీఆర్ఎస్ పాలన చేస్తోందన్నారు. ఇన్నేండ్ల తమ పాలనలో ఒక్క మత కల్లోలం కూడా జరగలేదన్నారు. దేశంలో పరిస్థితులు వున్నా తెలంగాణలో మాత్రం శాంతి భద్రతలు సజావుగానే వున్నాయన్నారు. అందువల్లే రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వస్తున్నాయన్నారు. దీంతో రాష్ట్రంలో యువతకు ఉద్యోగావకాశాలు పెరిగాయన్నారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్న రాహుల్ గాంధీ వ్యాఖ్యలను ఆమె ఎద్దేవా చేశారు. ఇన్ని అద్బుతమైన అభివృద్ధి పనులను తమ ప్రభుత్వం చేస్తుంటే కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని చెబుతుంటే నవ్వాలో, ఏడ్వాలో తెలియడం లేదన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం తన స్వప్నమని సోనియా గాంధీ చెప్పిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. అధికారంలోకి రావడం స్వప్నం ఉండవద్దన్నారు. తెలంగాణ దళితులు, మైనారిటీలు, బలహీన వర్గాలు, మహిళలు, యువకులు మరింత అభివృద్ధి చెందాలన్న స్వప్నం ఉండాలని చురకలంటించారు.

You may also like

Leave a Comment