ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha)ఆరోగ్యంపై కోర్టులో మరో పిటిషన్ వేయనున్నారు. తనకు మెడికల్ రిపోర్ట్స్(Medical Reports) ఇవ్వడం లేదని కవిత పిటిషన్ వేయనున్నట్లు తెలుస్తోంది. కవిత హై బీపీ(High BP)తో బాధ పడుతున్నారని ఆమె తరుఫు న్యాయవాది తెలిపారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు(Delhi liquor scam case) లో మార్చి 15న ఈడీ కవితను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే నేటితో కవిత కస్టడీ ముగియనుంది. దీంతో కవిత కస్టడీ కొనసాగింపును ఆమె తరపు లాయర్లు ఛాలెంజ్ చేయనున్నారు.
ఈడీ కస్టడీలో ఉన్న సమయంలో కవిత ఆరోగ్యంపై అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని కవిత న్యాయవాదులు ఆరోపిస్తున్నారు. కవిత ఆరోగ్య పరిస్థితిపై రిపోర్ట్ ఇవ్వాలని కోర్టు ద్వారా ఈడీని కోరారు. దీనిపై కోర్టులో మరో పిటిషన్ దాఖలు చేయనున్నట్లు వివరించారు.
మరో వైపు కవితను ఈడీ కాసేపట్లో రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపర్చనుంది. మరో మూడు రోజుల పాటు కస్టడీ కొనసాగింపునకు ఈడీ దాఖలు చేయనున్న పిటిషన్‌ను కవిత లాయర్లు ఛాలెంజ్ చేయనున్నట్లు తెలుస్తోంది.