ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(Mlc kalvakuntla kaviha) కాంగ్రెస్ పార్టీ(congress party)పై ట్విట్టర్(x) వేదికగా విమర్శలు గుప్పించారు. ‘కరెంటు కష్టాలు తెచ్చే కాంగ్రెస్ మనకెందుకు?.. మోసం చేయడం కాంగ్రెస్ నైజమని.. ఆ పార్టీకి ఓటేస్తే కర్ణాటక గతే పడుతుందని పేర్కొన్నారు. కర్ణాటక ఎన్నికల్లో(karnataka elections) ఇచ్చిన హామీలను ఏ ఒక్కటీ సరిగా అమలు చేయడం లేదని ధ్వజమెత్తారు.
20గంటల కరెంటు ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. ఇప్పుడు 5 గంటల కరెంటుతో సరిపెట్టుకోవాలని కర్ణాటక విద్యుత్ శాఖ మంత్రి చెబుతున్నారని ఎద్దేవా చేశారు. కర్ణాటక మంత్రిలానే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కూడా 3గంటల కరెంటు చాలంటున్నారని కవిత మండిపడ్డారు.
24గంటల కరెంటు అవసరమా? అని రేవంత్ ఓ ప్రెస్‌మీట్‌లో అన్న మాటలను కవిత ప్రస్తావించారు. దేశంలో ఉచితంగా 24 గంటల కరెంటు ఇస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్‌కే మద్దతుగా నిలుద్దామన్నారు. కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో పూర్తిగా విఫలమైందని తెలిపారు.
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజీపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఆయా పార్టీల వైఫల్యాలపై కవిత ఎప్పటికప్పుడు ట్విట్టర్(x) వేదికగా విమర్శనాస్త్రాలను సంధిస్తున్నారు. మొన్నటికి మొన్న ఎంపీ అరవింద్‌పై విమర్శలు చేసిన కవిత తాజాగా కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలపై ట్వీట్ చేశారు.
మోసం కాంగ్రెస్ నైజం..
కాంగ్రెస్ కు ఓటేస్తే కర్ణాటక గతే…
కాంగ్రెస్ వస్తే కరెంటు కటకటలు…20 గంటల పాటు కరెంటు ఇస్తామని ఎన్నికలప్పుడు చెప్పి ఇప్పుడు 5 గంటల కరెంట్ తో సరిపెట్టుకోండని కర్ణాటక విద్యుత్ శాఖ మంత్రి అంటున్నారు. కర్ణాటక మంత్రిలానే ఇక్కడ తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు… pic.twitter.com/9DUi4dRtap
— Kavitha Kalvakuntla (@RaoKavitha) October 19, 2023