జగిత్యాల జిల్లాలో ఎన్నికల ప్రచారంలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(Mlc Kavitha) అస్వస్థతకు గురై కళ్లు తిరిగి కింద పడిపోయారు. జగిత్యాల(Jagtial) జిల్లా రాయికల్(Raikal) మండలం ఇటిక్యాల(Itikyala)లో ఎన్నికల ప్రచారం చేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.
రాయికల్ మండలం ఇటిక్యాలలో రోడ్‌షోలో ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే సంజయ్ పాల్గొన్నారు. ప్రచార వాహనంలోనే ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూనే ఒక్కసారిగా స్పృహ తప్పి వాహనంలోనే పడిపోయారు. దీంతో అక్కడే వున్న మహిళా నాయకులు, పార్టీ శ్రేణులు వాహనంలోనే కవితకు సపర్యలు చేశారు. ఎండ తగటకుండా అడ్డు నిలబడి కవిత ముఖంపై నీటితో తుడిచారు.
అనంతరం ఎమ్మెల్సీ కవిత కాసేపు సేద తీరి నిలబడేందుకు ప్రయత్నం చేశారు. అక్కడ వున్నవారు లేవకూడదని కాసేపు సేద తీర్చుకోవాలని కోరడంతో కవిత కాసేపు వాహనంలో సేదతీరారు. కొద్దిసేపు తర్వాత మళ్లీ తేరుకున్న కవిత ఎన్నికల ప్రచారంలో ప్రసంగించారు.
ఈ ఘటనపై తాజాగా ఎమ్మెల్సీ కవిత x(ట్విట్టర్) వేదికగా స్పందించారు. నేను బాగానే ఉన్నానంటూ స్పందించారు. అంతేకాకుండా ఘటన జరిగిన తర్వాత ఓ పాపతో మాట్లాడిన వీడియోను షేర్ చేశారు. చేస్తూ.. ‘నేను ఈ పాపతో కొద్దిసేపు గడిపిన తర్వాత మరింత ఉత్సాహంగా ఉందంటూ’ ట్యాగ్ చేశారు.
Sorry for the little scare. I’m doing just well, also happened to have met this sweet little girl and after spending time with her I’m feeling a little more energetic. #KCROnceAgain campaign to resume shortly. ✊🏻 pic.twitter.com/YaO1Siw7Vk
— Kavitha Kalvakuntla (@RaoKavitha) November 18, 2023