Telugu News » Mohammad Rizwan: మైదానంలో నమాజ్.. వివాదంలో పాకిస్థాన్ క్రికెటర్!

Mohammad Rizwan: మైదానంలో నమాజ్.. వివాదంలో పాకిస్థాన్ క్రికెటర్!

క్రికెట్ మైదానంలో రిజ్వాన్ నమాజ్ చేసినట్లు సుప్రీంకోర్టు న్యాయవాది నవీన్ జిందాల్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ‘భారత ప్రేక్షకుల ముందు, తన మతాన్ని ఉద్దేశపూర్వకంగా ప్రదర్శించడం అన్నది క్రీడా స్ఫూర్తికి విరుద్ధం’ అని నవీన్ జిందాల్ అభ్యంతరం వ్యక్తం చేశారు.

by Mano
Mohammad Rizwan: Namaz on the field.. Pakistan cricketer in controversy!

పాకిస్థాన్ క్రికెటర్ మహమ్మద్ రిజ్వాన్(Mohammad rizwan) మైదానంలో నమాజ్‌ చేసి వివాదంలో పడ్డాడు. అతడి చర్యతో ఇది క్రీడాస్ఫూర్తికి విరుద్ధమంటూ సుప్రీంకోర్టు న్యాయవాది వినీత్ జిందాల్ ఆరోపించారు. దీనిపై ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)కు ఫిర్యాదు చేశారు.

Mohammad Rizwan: Namaz on the field.. Pakistan cricketer in controversy!
ప్రపంచకప్ 2023లో భాగంగా అక్టోబర్ 6న పాకిస్థాన్ జట్టు హైదరాబాద్ వేదికగా నెదర్లాండ్స్‌తో తలపడింది. ఈ మ్యాచ్ సందర్భంగానే క్రికెట్ మైదానంలో రిజ్వాన్ నమాజ్ చేసినట్లు సుప్రీంకోర్టు న్యాయవాది నవీన్ జిందాల్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ‘భారత ప్రేక్షకుల ముందు, తన మతాన్ని ఉద్దేశపూర్వకంగా ప్రదర్శించడం అన్నది క్రీడా స్ఫూర్తికి విరుద్ధం’ అని నవీన్ జిందాల్ అభ్యంతరం వ్యక్తం చేశారు.

‘మహమ్మద్ రిజ్వాన్ ఉద్దేశపూర్వకంగా తాను ముస్లింనని ప్రదర్శించడం, క్రీడాస్ఫూర్తికి ఓటమి లాంటిదని, జట్టు సభ్యులు డ్రింక్స్ కోసం వేచి చూసిన సమయంలో రిజ్వాన్ మైదానంలో ప్రార్థనలు చేశాడు’ అని జిందాల్ తన ఫిర్యాదులో వివరించారు. నమాజ్ చేయడమే కాకుండా, మ్యాచ్ అనంతరం విజయాన్ని గాజా ప్రజలకు అంకితం చేయడంతో ఇజ్రాయెల్ గట్టిగానే జవాబిచ్చింది. భారత్ చేతిలో ఓడిపోవడం ద్వారా తమ విజయాన్ని హమాస్ మిలిటెంట్లకు అంకింత చేసే అవకాశం లేకుండా పోయిందని ఎద్దేవా చేసింది.

You may also like

Leave a Comment