కాంగ్రెస్ ప్రభుత్వంలో సిలిండర్ ధర రూ.400 ఉంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏకంగా రూ.1200కు పెంచారని మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ(Congress Party) అభ్యర్థి మహమ్మద్ షబ్బీర్ అలీ(Shabbir Ali) అన్నారు. నిజామాబాద్‌లోని గాజుల్ పేటలో ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనపై విమర్శలు చేశారు.
బీసీ బంధు, మైనార్టీ బంధు తదితర ప్రభుత్వ పథకాల్లో అవినీతి జరిగిందని ఆరోపిస్తూ.. ఎమ్మెల్యేల ప్రమేయంపై కేసీఆర్ మందలించారని మహ్మద్ అలీ వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. స్థానిక ఆందోళనలను హైలైట్ చేస్తూ, షబ్బీర్ అలీ నగరం యొక్క దిగజారుతున్న పరిస్థితులను ఎత్తి చూపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ప్రతీ మహిళకు 60 ఏళ్ల లోపు ఉన్న వారందరికీ రూ.2500 ఆర్థిక సాయాన్ని అందజేస్తామని చెప్పారు. రాష్ట్రంలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఎక్కడ ప్రయాణం చేసిన వారందరికీ ఫ్రీ అని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవని, కేసీఆర్ కుటుంబంలో మాత్రం అందరికీ ఉద్యోగాలే అని షబ్బీర్ అలీ మండిపడ్డారు.
మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి హయాంలోనే 108 సేవలు ప్రారంభమయ్యాయని గుర్తు చేశారు. ఎన్నికల్లో గెలుపొందాక ఆరోగ్యశ్రీ కి 10లక్షలు అమలు చేస్తామన్నారు. ప్రభుత్వం చెబుతున్న అభివృద్ధి నగరం నోచుకోలేదని షబ్బీర్ అలీ ఆరోపించారు. యూనివర్సిటీలో ఉద్యోగాల కోసం తెలంగాణ కోసం అమరులైతే ఆదుకోలేదన్నారు.
దశాబ్దాల కేంద్ర ప్రభుత్వ పాలనను షబ్బీర్ అలీ ప్రశ్నించారు. అదానీ, అంబానీలను ఉదాహరణగా చూపుతూ అభివృద్ధిని కోరుకునే కొద్దిమందికే లబ్ధి చేకూర్చారన్నారు. ప్రతీ ఒక్కరి అభివృద్ధి, ప్రగతి కోసం కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి అధికార పార్టీకి గుణపాఠం చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు.