Telugu News » Telangana : చంద్రబాబు అరెస్ట్ కు నిరసన.. బీఆర్ఎస్ నేత దీక్ష!

Telangana : చంద్రబాబు అరెస్ట్ కు నిరసన.. బీఆర్ఎస్ నేత దీక్ష!

రెండు, మూడు రోజుల్లో చంద్రబాబును కలుస్తానని.. వారి కుటుంబ సభ్యులను పరామర్శిస్తానని తెలిపారు. తన హయాంలో లక్షల కోట్ల బడ్జెట్‌ ను ప్రవేశపెట్టిన చంద్రబాబు.. ముష్టి రూ.371 కోట్ల స్కాం చేస్తారా? అని ప్రశ్నించారు.

by admin

– స్వరం మార్చిన మోత్కుపల్లి
– ఒకప్పుడు చంద్రబాబుపై తీవ్ర ఆగ్రహం
– ఇప్పుడు ఆయన కోసం ఏకంగా దీక్ష
– జగన్ పై ఫుల్ ఫైర్
– ఈసారి గెలిచేది చంద్రబాబేనంటూ జోస్యం
– మోత్కుపల్లి తీరుపై రాజకీయ వర్గాల్లో చర్చ

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం చుట్టూ ఏపీ రాజకీయాలు నడుస్తున్నాయి. టీడీపీ (TDP) శ్రేణులు రాస్తారోకోలు, నిరసన కార్యక్రమాలతో హోరెత్తిస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదో ఒక రూపంలో తమ నిరసన స్వరాన్ని వినిపిస్తున్నారు. చంద్రబాబు (Chandrababu) అరెస్ట్ పై పార్టీలకతీతంగా నాయకులు ఖండిస్తున్నారు. అయితే.. తెలంగాణ (Telangana) లో బీఆర్ఎస్ (BRS) కు చెందిన కీలక నేత దీక్షకు దిగడం హాట్ టాపిక్ గా మారింది. ఆ లీడర్ ఎవరో కాదు.. మోత్కుపల్లి నర్సింహులు (Motkupalli Narsimhulu).

Motkupalli Narasimhulu Deeksha On Chandrababu Arrest

చంద్రబాబు అరెస్ట్ ను వ్యతిరేకిస్తూ హైదరాబాద్ లో దీక్షకు దిగారు మోత్కుపల్లి. ముందుగా ఎన్టీఆర్ (NTR) ఘాట్‌ లో నివాళులర్పించిన ఆయన.. అక్కడే నిరసన దీక్షను ప్రారంభించారు. అయితే.. ఈ దీక్షకు ఎన్టీఆర్ ఘాట్‌ లో అనుమతి లేదని పోలీసులు అభ్యంతరం తెలిపారు. దీక్ష చేసి తీరుతానని ఆయన స్పష్టం చేశారు. దీంతో గంట పాటు అనుమతిచ్చారు పోలీసులు.

చంద్రబాబు అక్రమ అరెస్ట్ ప్రజాస్వామ్యానికే ప్రమాదకరమని, ఈ అరెస్ట్‌ ను మేధావులు ఖండించాలని మోత్కుపల్లి పిలుపునిచ్చారు. రెండు, మూడు రోజుల్లో చంద్రబాబును కలుస్తానని.. వారి కుటుంబ సభ్యులను పరామర్శిస్తానని తెలిపారు. తన హయాంలో లక్షల కోట్ల బడ్జెట్‌ ను ప్రవేశపెట్టిన చంద్రబాబు.. ముష్టి రూ.371 కోట్ల స్కాం చేస్తారా? అని ప్రశ్నించారు. అయినా చంద్రబాబు నెత్తిన పాలు పోశారని.. వచ్చే ఎన్నికల్లో ఆయనే గెలుస్తారని జోస్యం చెప్పారు. జైల్లో చంద్రబాబుకు సరైన భద్రత లేదన్న ఆయన.. లోకేశ్‌ నూ అరెస్టు చేసేందుకు జగన్‌ సర్కార్ కుట్ర పన్నుతోందన్నారు.

మోత్కుపల్లి నర్సింహులు ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నారు. గతంలో టీడీపీలో పని చేశారు. 1983లో టీడీపీలో చేరారు. 1985లో ఆలేరు నుండి పోటీ చేసి గెలిచారు. సుదీర్ఘంగా టీడీపీలో కొనసాగిన మోత్కుపల్లి.. 2018లో చంద్రబాబు తీరును ప్రశ్నిస్తూ.. తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయన్ను పార్టీ బహిష్కరించింది. ఆ తర్వాత 2019లో బీజేపీలో చేరారు. అక్కడ కొన్నాళ్లపాటు కొనసాగిన ఆయన.. 2021లో బీఆర్ఎస్ గూటికి చేరారు. గతంలో చంద్రబాబును తిట్టిన మోత్కుపల్లి.. ఇప్పుడు మద్దతుగా మాట్లాడడం చర్చనీయాంశంగా మారింది.

You may also like

Leave a Comment