Telugu News » హైప్ లేకుండా రిలీజ్ అయిన… సినిమాల్లో ఎన్ని హిట్స్… ఎన్ని ప్లాప్స్ అంటే…?

హైప్ లేకుండా రిలీజ్ అయిన… సినిమాల్లో ఎన్ని హిట్స్… ఎన్ని ప్లాప్స్ అంటే…?

by Sravya

కొన్ని కొన్ని సినిమాలు ఎలాంటి హైప్ లేకుండా రిలీజ్ అవుతూ ఉంటాయి అలా రిలీజ్ అయ్యి హిట్టో, ప్లాప్ ఓ కొట్టిన సినిమాల వివరాలని చూద్దాం. ఎన్టీఆర్ హీరోగా వచ్చిన రభస సినిమా ఎటువంటి హైప్ లేకుండా వచ్చింది 2014లో ఇది రిలీజ్ అయింది. హిట్ అవుతుంది అనుకున్నారు కానీ డిజాస్టర్ గా మిగిలిపోయింది. మహేష్ బాబు హీరోగా వచ్చిన బ్రహ్మోత్సవం సినిమా కూడా ఎలాంటి హైప్ లేకుండా వచ్చింది. 2016 లో ఇది రిలీజ్ అయింది.

డిసాస్టర్ గా ఇది మిగిలిపోయింది. రామ్ చరణ్ హీరోగా వచ్చిన ధ్రువ సినిమా కూడా ఎటువంటి హైప్ లేకుండా రిలీజ్ అయింది. బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్ ఫలితాన్ని రాబట్టుకుంది. ఆ సమయంలో 500 రూపాయల నోట్లు, వెయ్యి రూపాయలు నోట్లు రద్దడంతో ఈ సినిమాకి పెద్ద మైనస్ అయింది. పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన కాటమరాయుడు సినిమా కూడా హైప్ లేకుండా రిలీజ్ అయింది. కాటమరాయుడు సినిమా ఫ్లాప్ అయ్యింది.

మహేష్ బాబు హీరోగా వచ్చిన స్పైడర్ సినిమా కూడా డిజాస్టర్ అయ్యింది. తెలుగు నేటివిటీకి కంప్లీట్ గా దూరంగా ఉండటంతో పెద్ద మైనస్ అయింది. నాగార్జున రామ్ గోపాల్ వర్మ సినిమా ఆఫీసర్ కూడా హైప్ లేకుండా వచ్చింది డిజాస్టర్ గానే మిగిలిపోయింది.

Also read:

నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా కూడా ఎటువంటి హైప్ లేకుండా రిలీజ్ అయింది అల్లు అర్జున్ హీరోగా వచ్చిన ఈ సినిమా డిజాస్టర్ టాక్ని సొంతం చేసుకుంది. ఎన్టీఆర్ కథానాయకుడు కూడా హైప్ లేకుండా వచ్చింది డిజాస్టర్ గా మిగిలింది. ఆచార్య సినిమా కూడా పెద్ద డిజాస్టర్ అయింది. మెగాస్టార్ హీరోగా వచ్చిన గాడ్ ఫాదర్ సినిమా కూడా ఎలాంటి హైప్ లేకుండా రిలీజ్ అయింది సినిమా ఒరిజినల్ ఆల్రెడీ తెలుగులో డబ్ అవడంతో ఈ సినిమా పెద్దగా ఆడియన్స్ కి నచ్చలేదు యావరేజ్ గానే ఉండిపోయింది.

You may also like

Leave a Comment