Telugu News » Aravid : బీఆర్ఎస్ మెనిఫెస్టోను చించి వేయాలి….!

Aravid : బీఆర్ఎస్ మెనిఫెస్టోను చించి వేయాలి….!

కేంద్రం ఇచ్చిన నిధుల (Funds) వల్లే తెలంగాణ అభివృద్ధి (Devolopment) చెందిందన్నారు.

by Ramu
Mp Aravind fire on brs and Congress

ప్రధాని మోడీ (PM MOdi) ని మంత్రి కేటీఆర్ (KTR )విమర్శిస్తే చూస్తూ ఉరుకోబోమని నిజామాబాద్ ఎంపీ అరవింద్ (MP Aravind) అన్నారు. కేసీఆర్ కుటుంబం (KCR Family) వల్ల తెలంగాణకు నయాపైసా మేలు జరగలేదన్నారు. కేంద్రం ఇచ్చిన నిధుల (Funds) వల్లే తెలంగాణ అభివృద్ధి (Devolopment) చెందిందన్నారు.

Mp Aravind fire on brs and Congress

గత ఎన్నికల్లో బీఆర్ఎస్ రెండు సార్లు ఎన్నికల మెనిఫెస్టోను ప్రకటించిందన్నారు. కానీ మెనిఫెస్టోలో ఏ ఒక్క హామీని కూడా బీఆర్ఎస్ నెరవేర్చలేదన్నారు. ఈ సారి బీఆర్ఎస్ ప్రకటించే మెనిఫెస్టోను చించి వేయాలన్నారు. బీజేపీ కార్యాలయంలో కౌన్సిల్ సమావేశాన్ని నిర్వ హించారు. ఈ సందర్బంగా ఎంపీ అరవింద్ మాట్లాడుతూ…. తెలంగాణ వీరుల పోరాటల ఫలితంగానే సోనియా గాంధీ తెలంగాణ ప్రకటన చేశారని తెలిపారు.

అసలు అదానీని పైకి తీసుకు వచ్చిందే కాంగ్రెస్ అని మండిపడ్డారు. సోనియా గాంధీ కాదు స్కాంల గాంధీ అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. రేవంత్‌రెడ్డి ఓటుకు నోటు కేసు ఏమైందీ..? అని ఆయన ప్రశ్నించారు. పసుపు బోర్డు ఎలా పని చేస్తుందో రేవంత్‌రెడ్డికి అవగాహన లేదన్నారు. గతంలో మంత్రిగా పని చేసిన అనుభవం రేవంత్‌రెడ్డికి లేదన్నారు.

జీవితంలో రేవంత్ రెడ్డి మంత్రి కాలేరంటూ ఎద్దేవా చేశారు. పసుపు బోర్డు ఎక్కడ పెట్టాలో తమకు బాగా తెలుసన్నారు. ఆ విషయంలో రేవంత్ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. పసుపు పంటను కాంగ్రెస్ నాశనం చేసిందని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ను రేవంత్ రెడ్డి ఎప్పుడు వీడతారో తెలియదన్నారు. రేవంత్‌రెడ్డి కొడంగల్‌‌లో ఓడిపోతేనే మల్కాజిగిరి నుంచి చివరి నిమిషంలో పోటీ చేశారన్నారు. సగం పార్లమెంట్‌ స్థానాలల్లో కాంగ్రెస్ అడ్రస్ లేదన్నారు అలాంటప్పుడు కాంగ్రెస్‌కు ఇక అసెంబ్లీ 61 సీట్లు ఎక్కడి నుంచి వస్తాయన ప్రశ్నించారు. .

You may also like

Leave a Comment