Telugu News » Aaravind : కవిత కన్నా ముందే కేటీఆర్ జైలుకు…. ఎంపీ అరవింద్ కీలక వ్యాఖ్యలు……!

Aaravind : కవిత కన్నా ముందే కేటీఆర్ జైలుకు…. ఎంపీ అరవింద్ కీలక వ్యాఖ్యలు……!

కవిత కన్నా ముందే కేటీఆర్ జైలుకు పోయినా ఆశ్చర్య పడాల్సిన అవసరం లేదన్నారు.

by Ramu
mp dharmapuri arvind sensational comments on mlc kavita minister ktr

మాదక ద్రవ్యాల సేవనంలో రాష్ట్రాన్ని ముందుంచి కేటీఆర్ (KTR) ఆయన తండ్రి పేరును నిలబెట్టారని బీజేపీ (BJP) ఎంపీ ధర్మపురి అరవింద్ (Aravind) అన్నారు. ఎమ్మెల్సీ కవిత రేపో మాపో జైలుకు వెళ్తారని అన్నారు. కవిత కన్నా ముందే కేటీఆర్ జైలుకు పోయినా ఆశ్చర్య పడాల్సిన అవసరం లేదన్నారు. పసుపు బోర్డు ఏర్పాటు ప్రకటనతో రైతులు చాలా ఆనందంగా వున్నారని చెప్పారు.

mp dharmapuri arvind sensational comments on mlc kavita minister ktr

పసుపు బోర్డు ఏర్పాటుపై ఇటీవల ప్రధాని మోడీ చేసిన ప్రకటన నేపథ్యంలో పార్టీ జిల్లా కార్యాలయం వద్ద సంబురాలు నిర్వహించారు. పసుపు రైతులతో కలిసి హోలీ సంబురాలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఎంపీ ధర్మపురి అరవింద్ మాట్లాడుతూ….. పసుపు బోర్డు ఏర్పాటుపై స్వయంగా ప్రధాని నోటి నుంచి ప్రకటన రావడంపై అరవింద్ హర్షం వ్యక్తం చేశారు.

ప్రధాని ప్రకటనతో తెలంగాణలో బీజేపీ శ్రేణుల్లో ఆనందం వ్యక్తమవుతోందన్నారు. పసుపు బోర్డు ఏర్పాటుతో రైతులు చాలా ఉత్సాహంగా వున్నారని చెప్పారు. రైతులు పసుపు బోర్డు ఏర్పాటుతో చాలా ఉత్సాహంగా ఉన్నారని పేర్కొన్నారు. పసుపు బోర్డు ప్రకటన నేపథ్యంలో తాను ట్విట్టర్ వేదికగా ప్రధాని మోడీకి ట్వీట్ చేశానన్నారు. దానికి ప్రధాని మోడీ స్పందించడం తనకు చాలా ఆనందాన్ని కలిగించిందన్నారు.

రైతుల శ్రేయస్సు, సామర్థ్యాలే మనకు ముఖ్యమని ప్రధాని మోడీ వెల్లడించారన్నారు. పసుపు రైతుల ఉజ్వల భవిష్యత్ కోసం తమ ప్రభుత్వం ఏమైనా చేస్తుందని మోడీ అన్నారని తెలిపారు. వారి కోసం ఎంతవరకైనా వెళ్తామని ప్రకటించారని పేర్కొన్నారు. పసుపు బోర్డు వల్ల జిల్లాలో మౌలిక సదుపాయాలు పెరుగుతాయన్నారు. ప్రధాని మోడీ వ్యాఖ్యలపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు అర్థరహితమని మండిపడ్డారు.

మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గంజాయి మార్కెటింగ్ సేల్స్ మేనేజర్‌గా బాగా పనికొస్తారని ఎద్దేవా చేశారు. మోడీని ప్రపంచం మొత్తం కీర్తిస్తోందన్నారు. జీ20 దేశాల సదస్సు నిర్వహణతో భారత ఖ్యాతి ప్రపంచ నలమూలకు వ్యాపించిందన్నారు. కేటీఆర్, కవితలు తెలంగాణ ఉద్యమంలో లేరన్నారు. ఎక్కడి నుంచో వచ్చి ఇప్పుడు పదవులు అనుభవిస్తున్నారని విమర్శలు గుప్పించారు.

You may also like

Leave a Comment