టాలీవుడ్ ఇండస్ట్రీలో యాంకర్ కమ్ యాక్టర్ అనసూయ(Anchor Anasuya) గురించి తెలియని వారుండరు. ఈ అమ్మడు సినిమాల్లోనే కాకుండా సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్‌గా ఉంటుంది. గతంలో జబర్దస్త్(Jabardasth) యాంకర్‌గా ఫేమస్(Famous) అయిన అనసూయ.. ఆ తర్వాత కొంతకాలానికి గ్లామర్ డోస్‌ను ఒక్కసారే పెంచేయడంతో ఆమెకు వరుసగా సినిమా ఆఫర్లు తలుపుతట్టాయి.
ఓవైపు యాంకరింగ్ , టీవీ షోస్ చేస్తూనే మరోవైపు సినిమాల్లోనూ కీలక పాత్రల్లో నటిస్తోంది. గతంలో సుకుమార్ దర్శకత్వంలో హీరో రాంచరణ్ లీడ్ రోల్ పోషించిన ‘రంగస్థలం’ మూవీలో అనసూయ ‘రంగమ్మత్త’ క్యారెక్టర్‌లో నటించి మంచి పేరు సంపాదించుకుంది. మరోసారి సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘పుష్ప’ మూవీలో సునీల్(మంగళం శ్రీను) భార్యగా కూడా అనసూయ అద్భుతంగా అలరించింది.
అయితే, అనసూయ ఇటీవలి కాలంలో గ్లామర్ డోస్ అమాంతం పెంచేసింది. తనకు పెళ్లయి ఇద్దరు పిల్లలు ఉన్న విషయం మర్చిపోయిందా? అని కొందరు కామెంట్స్ చేస్తున్నా అనసూయ మాత్రం అవేమీ పట్టించుకోవడం లేదు. పొట్టి బట్టలు, నిక్కర్లు వేస్తూ కుర్రకారును తెగ ఉర్రూతలు ఊగిస్తోంది. సోషల్ మీడియాలో అనసూయకు విపతీరంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆమె బోల్డ్ పిక్స్‌కు పిచ్చపాటిగా ట్రోల్స్, కామెంట్స్ వస్తున్నా అనసూయ మరింత రెచ్చిపోతోంది.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనసూయ ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. ‘నేను పొట్టి బట్టలు వేసుకోవడం నా పెద్ద కొడుక్కి ఇష్టముండదు. ఒకసారి డైరెక్ట్ అడిగేశాడు. మమ్మీ ఏంటా డ్రెస్ పెద్దది వేసుకోవచ్చుగా అన్నాడు. అప్పుడు నేను ఓ మాట చెప్పాను. అవి నా బట్టలు నా ఇష్టం. నువ్వు వేసుకునే టీ షర్ట్ కూడా నాకు నచ్చలేదు. అలా అని నిన్ను వేసుకోవద్దని చెప్పలేదు కదా.
అది నీ ఇష్టం కాబట్టి ఒప్పుకున్నాను. నేను కూడా అంతే. నాకు నచ్చిన బట్టలు వేసుకుంటానని చెప్పాను’ అని బదులిచ్చింది. ఇక క్యాస్టింగ్ కౌచ్ విషయంలో కొందరు కమిట్‌మెంట్ అడిగారు. అలా వాళ్లు చెప్పింది చేయడం నాకు ఇష్టముండదు. అందుకే చాలా అవకాశాలు మిస్ అయ్యాయి అని అనసూయ సంచలన వ్యాఖ్యలు చేసింది.