Telugu News » NIA Raids: ఉగ్రవాద కుట్రకు చెక్.. కర్ణాటక, మహారాష్ట్రలో 41 చోట్ల ఎన్ఐఏ ఆకస్మిక దాడులు..!

NIA Raids: ఉగ్రవాద కుట్రకు చెక్.. కర్ణాటక, మహారాష్ట్రలో 41 చోట్ల ఎన్ఐఏ ఆకస్మిక దాడులు..!

ఉగ్రవాద కుట్ర కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ శనివారం ఆకస్మిక దాడులు (NIA Raids) చేపట్టింది. కర్ణాటక (Karnataka), మహారాష్ట్ర (Maharashtra)లో ఏకకాలంలో 41 చోట్ల ఉదయం నుంచి విస్తృతంగా దాడులు నిర్వహిస్తోంది.

by Mano
NIA Raids: Check the terrorist conspiracy.. NIA surprise raids at 41 places in Karnataka and Maharashtra..!

రెండు రాష్ట్రాల్లో ఎన్ఐఏ అధికారుల దాడులు సంచలనం రేపాయి. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద కుట్ర కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ శనివారం ఆకస్మిక దాడులు (NIA Raids) చేపట్టింది. కర్ణాటక (Karnataka), మహారాష్ట్ర (Maharashtra)లో ఏకకాలంలో 41 చోట్ల ఉదయం నుంచి విస్తృతంగా దాడులు నిర్వహిస్తోంది.

NIA Raids: Check the terrorist conspiracy.. NIA surprise raids at 41 places in Karnataka and Maharashtra..!

 

థానే రూరల్‌ ప్రాంతంలో 31 చోట్ల, థానే సిటీలో 9 చోట్ల, పూణెలో రెండు చోట్ల, మీరా భయాందర్‌లో ఒక చోట ఎన్‌ఐఏ అధికారులు సోదాలు చేపడుతున్నారు. కర్ణాటక రాష్ట్రంలో ఒక చోట అధికారులు తనిఖీలు చేపడుతున్నారు. దాడుల్లో 13 మందిని ఎన్‌ఐఏ అధికారులు అరెస్ట్‌ చేశారు.

అరెస్టయిన వారితో ఇస్లామిక్ స్టేట్‌తో సంబంధం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. దేశవ్యాప్తంగా ఉగ్రదాడులకు పాల్పడేందుకు ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాద సంస్థ కుట్ర పన్నిందన్న సమాచారంతోనే జాతీయ దర్యాప్తు సంస్థ ఈ దాడులు చేపడుతున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు తీవ్రవాద చర్యలకు పాల్పడుతున్న వారిపై ఎన్ఐఏ ఉక్కుపాదం మోపనుంది.

ఐఎస్ఐఎస్ తీవ్రవాదులతో సంబంధాలున్న వారిపై కేసులు పెడతామని ఎన్ఐఏ అధికారులు చెప్పారు. భారతదేశంలో ఐఎస్ఐఎస్ తీవ్రవాద భావజాలాన్ని ప్రచారం చేస్తున్న వ్యక్తుల గుట్టును ఎన్ఐఏ అధికారులు రట్టు చేశారు. ఈ తీవ్రవాద సంస్థ సభ్యులు పేలుడు పరికరాలను తయారు చేస్తున్నారని అధికారులు గుర్తించారు. గతంలో ఎన్ఐఏ జరిపిన దాడుల్లోనూ ఐఎస్ఐఎస్ కుట్ర కోణం వెలుగుచూసింది.

You may also like

Leave a Comment