Telugu News » Simultaneous Election : 2024లో జమిలి ఎన్నికలపై లా కమిషన్ వర్గాల కీలక వ్యాఖ్యలు….!

Simultaneous Election : 2024లో జమిలి ఎన్నికలపై లా కమిషన్ వర్గాల కీలక వ్యాఖ్యలు….!

జమిలి ఎన్నికల గురించి లా కమిషన్ తన నివేదికను 2024 లోక్ సభ ఎన్నికలలోపు ప్రచురించే అవకాశం ఉన్నట్టు లా కమిషన్ చైర్మన్ రుత్ రాజ్ అవస్థి వెల్లడించారు

by Ramu
No simultaneous polls in 2024, say Law Commission sources

2024లో జమిలి ఎన్నికలు ( Simultaneous elections) ఉండబోవని లా కమిషన్ (Law Comission) వర్గాలు తెలిపాయి. 2024లో ‘వన్ నేషన్-వన్ ఎలక్షన్’ (One Nation-One Election) కింద జమిలి ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాకపోవచ్చని లా కమిషన్ వర్గాలు పేర్కొన్నాయి. జమిలి ఎన్నికల గురించి లా కమిషన్ తన నివేదికను 2024 లోక్ సభ ఎన్నికలలోపు ప్రచురించే అవకాశం ఉన్నట్టు లా కమిషన్ చైర్మన్ రుత్ రాజ్ అవస్థి వెల్లడించారు.

No simultaneous polls in 2024, say Law Commission sources

జమిలి ఎన్నికలకు సంబంధించి ఇంకా అధ్యయనం కొనసాగుతున్నందున నివేదిక ఇంక కొంత ఆలస్యం అయ్యే అవకాశం ఉన్నట్టు తెలిపారు. దేశంలో జమిలి ఎన్నికల నిర్వహణ కోసం రాజ్యాంగంంలోని పలు నిబంధనలకు ఆ నివేదిక పలు సవరణలను సూచించే అవకాశం ఉన్నట్టు లా కమిషన్ వర్గాలు పేర్కొంటున్నాయి. ముఖ్యంగా ఇవి లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి వుంటాయని చెబుతున్నాయి.

గ‌త ఏడాది డిసెంబ‌ర్‌ లో 22వ లా క‌మిష‌న్ జ‌మిలి ఎన్నిక‌ల ప్ర‌తిపాద‌న‌పై పలు జాతీయ, ప్రాంతీయ పార్టీలు, ఎన్నికల సంఘం అధికారులు, విద్యా వేత్తలు, నిపుణుల అభిప్రాయాలను సేకరించేందుకు ఆరు ప్రశ్నలు రూపొందింది. 2024 లోక్ సభ ఎన్నికల లోపు ఈ నివేదిక వెలుపడే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నివేదికను న్యాయ మంత్రిత్వ శాఖకు లా కమిషన్ అందజేయనుంది.

22వ లా కమిషన్ 2018లో ఓ డ్రాఫ్టును కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖకు అందజేసింది. లోక్ సభ, అసెంబ్లీలకు ఒకే సారి ఎన్నికలు నిర్వహిస్తే చాలా వరకు డబ్బును పొదుపు చేయవచ్చిని ఆ ముసాయిదాలో పేర్కొంది. దీంతో పాటు అధికారులపై పని ఒత్తిడిని చాలా వరకు తగ్గించ వచ్చని వెల్లడించింది. ప్రభుత్వ విధానాలను కూడా మరింత సమర్థవంతంగా అమలు చేసే వీలు కలుగుతుందని పేర్కొంది.

You may also like

Leave a Comment