Telugu News » కేంద్ర హోంశాఖ మంత్రిని కలవనున్న ఎన్టీఆర్.. కారణం అదేనా..?

కేంద్ర హోంశాఖ మంత్రిని కలవనున్న ఎన్టీఆర్.. కారణం అదేనా..?

by Sravya

జూనియర్ ఎన్టీఆర్ చంద్రబాబు ని అరెస్ట్ చేసిన తర్వాత ఏ విధంగా కూడా స్పందించలేదు దానిమీద టిడిపి శ్రేణులు అలానే బాలకృష్ణ కూడా ఆ విషయంపై స్పందిస్తూ ఐ డోంట్ కేర్ అని ఆన్సర్ చెప్పారు. కానీ ఇప్పుడు ఎన్టీఆర్ అమిత్ షా ని కలవబోతున్నట్లు తెలుస్తోంది యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమాతో బిజీగా ఉన్నారు. సినిమాలో బిజీగా ఉంటూ ఎన్టీఆర్ త్వరలోనే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ని మీట్ అవుతున్నట్లు తెలుస్తోంది ప్రస్తుతం ఈ వార్త వైరల్ అవుతోంది.

హైదరాబాదులో శాసనసభ ఎన్నికల్లో జరగబోతున్నటువంటి నేపథ్యంలో కొంతమంది కేంద్ర మంత్రులు తెలంగాణకి వస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణలో బిజెపి పార్టీని బలపరచడం కోసం పలు పార్టీలతో పొత్తుకుదురుచుకోవడానికి కూడా సిద్ధమవుతున్నారు జనసేనతో కలిసి ఎన్నికల బరిలోకి దిగాలని ప్రయత్నాలు చేసినా పవన్ కళ్యాణ్ మాత్రం టిడిపి తో పొత్తు కుదుర్చుకున్నారు ఈ క్రమంలోనే ఎన్టీఆర్ నీ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కలవబోతున్నారని వార్త వస్తోంది. ప్రస్తుతం ఇది ఆసక్తికరంగా మారింది.

Also read:

అసలు జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు అమిత్ షా ని కలవబోతున్నారని ప్రస్తుతం అంతా ఆరా తీస్తున్నారు. ఎన్టీఆర్ ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉన్నారు అలానే చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినా కూడా ఏ విధంగా రియాక్ట్ కాలేదు ఈ విషయంపై బాలయ్య స్పందిస్తూ ఐ డోంట్ కేర్ అని చెప్పారు. గతంలో మునుగోడు ఎన్నికల సమయంలో కూడా హైదరాబాద్ హలో అమిత్ షా ని ఎన్టీఆర్ కలిశారు అరగంట పాటు వీళ్ళిద్దరూ సమావేశంలో పాల్గొన్నారు ఈ క్రమంలోనే మళ్లీ ఎన్టీఆర్ తో ఇలా భేటీ కాబోతున్నారు. రాజకీయపరమైన అంశాలని ప్రస్తావించడం కోసమే కలవనున్నారని వార్తలు వస్తున్నాయి. ఇప్పటిదాకా ఈ విషయం గురించి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

 

You may also like

Leave a Comment