ఇజ్రాయెల్ (Israel)- హమాస్ (Hamas) మధ్య యుద్ధం ఐదవ వారానికి చేరుకుంది. తాజాగా సెంట్రల్ గాజా (Central Gaza)లోని ఓ శరణార్థుల శిబిరంపై ఇజ్రాయెల్ సైన్యం దాడులు చేసింది. ఈ ఘటనలో 50 మంది మరణించినట్టు హమాస్ నేతృత్వంలోని ఆరోగ్య శాఖ వెల్లడించింది.
సెంట్రల్ గాజా స్ట్రిప్‌లోని అల్-మఘాజీ శిబిరంపై ఇజ్రాయెల్ దాడులు చేసిందని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ ఘటన 30 మరణించగా వారి మృత దేహాలను డీర్-అల్-బలాలోని అల్ అక్సా ఆస్పత్రికి తరలించినట్టు చెప్పింది. ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పటి వరకు 9400 మరణించారని ఆందోళన వ్యక్తం చేసింది.
మరోవైపు గాజా నుంచి విదేశీయుల తరలింపు ప్రక్రియను తాత్కాలికంగా నిలిపి వేస్తున్నట్టు హమాస్ ప్రభుత్వం పేర్కొంది. గాయపడిన పాలస్తీనియన్లు గాజా స్ట్రిప్ నుంచి రఫా సరిహద్దు గుండా ఈజిప్ట్ వెళ్లేందుకు ఇజ్రాయెల్ దళాలు అనుమతించే వరకు గాజా నుంచి విదేశీయుల తరలింపును తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. .
మరోవైపు వందలాది మంది ఆశ్రయం పొందుతున్న ఓ పాఠశాలపై నిన్న ఇజ్రాయెల్ సైన్యం దాడులు చేసింది. ఈ దాడుల్లో 15 మంది మరణించినట్టు అధికారులు తెలిపారు. అదే సమయంలో ఓ అంబులెన్స్ కూడా ఇజ్రాయెల్ దాడులు చేసినట్టు అందులో 15 మంది మరణించగా, 60 మందికి గాయాలైనట్టు వెల్లడించారు.