కాంగ్రెస్ (Congress) అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) కి ఏఐఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ (Asaduddin Owaisi) సవాల్ విసిరారు. దమ్ముంటే రాబోయే ఎన్నికల్లో కేరళలోని వయనాడ్ నుంచి కాకుండా హైదరాబాద్ నుంచి పోటీ చేయాలని సవాల్ చేశారు. యూపీలోని బాబ్రీ మసీదు కాంగ్రెస్ హయాంలోనే కూల్చి వేశారని ఆయన గుర్తు చేశారు. హైదరాబాద్ లో బహిరంగ సభలో అన్నారు.
మీ అగ్రనేత రాహుల్ గాంధీకి నేను సవాల్ విసురుతున్నానన్నారు. రాబోయే లోక్ సభ ఎన్నికల్లో వయనాడ్ నుంచి కాకుండా హైదరాబాద్ నుంచి పోటీ చేయాలని సవాల్ చేస్తున్నానన్నారు. మీరు పెద్ద పెద్ద స్టేట్ మెంట్స్ ఇస్తున్నారంటూ మండిపడ్డారు. దమ్ముంటే మైదానంలోకి రావాలని, తనపై ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలని ఆయన సవాల్ చేశారు.
కాంగ్రెస్ నేతలు ఎన్నో కథలు చెబుతారన్నారు. కానీ బాబ్రీ మసీదు, సెక్రటేరియట్ లోని మసీదు కూల్చి వేత కాంగ్రెస్ హయాంలోనే జరిగిందన్నారు. దీనిపై చర్చకు రెడీ అన్నారు. ఇటీవల తుక్కుగూడలో జరిగిన విజయభేరి సభలో ఎంఐఎంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రంగా విరుచుకుపడ్డారు. తెలంగాణలో కాంగ్రెస్ కేవలం బీఆర్ఎస్ తో పోరాడటం లేదన్నారు.
తెలంగాణలో తమ పార్టీ బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎంలపై పోరాడుతోందన్నారు. తామంతా భిన్న పార్టీలని ఆ మూడు పార్టీలు చెప్పుకుంటాయన్నారు. కానీ ఆ మూడు పార్టీలు కలిసే పని చేస్తాయని ఫైర్ అయ్యారు. మోడీ సర్కార్ అందరిపై సీబీఐ-ఈడీ కేసులు పెడుతోందన్నారు. కానీ తెలంగాణ సీఎం, ఎంఐఎం అధ్యక్షునిపై మాత్రం ఎలాంటి కేసులు పెట్టడం లేదని ఆరోపించారు.