పాకిస్తాన్(Pakistan)లో పరిస్థితులు రోజురోజుకు దిగజారిపోతున్నాయి. నిత్యావసరాల ధరలు అమాంతం పెరగడంతో ప్రజలు సతమతమవుతున్నారు. కనీసం రెండు పూటల తినడానికి తిండిలేక అల్లాడుతున్నారు. దీనికి ప్రధాన కారణం అక్కడ ద్రవ్యోల్బణం(Inflation) అదుపు తప్పడమే.
పాకిస్తాన్లో ద్రవ్యోల్బణం 40 శాతానికి పైగానే కొనసాగుతోంది. 308.90తో పోలిస్తే 309.09 శాతానికి చేరుకుంది. పాకిస్తాన్లోని 17 ప్రధాన నగరాల్లోని 50 మార్కెట్ల నుంచి 51 నిత్యావసర వస్తువుల నుంచి ఈ గణాంకాలను తయారుచేశారు. పాకిస్థాన్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ విడుదల చేసిన గణాంకాల ప్రకారం నవంబర్ 23తో ముగిసిన వారంలో దేశ ద్రవ్యోల్బణం 41.13 శాతంగా నమోదైంది.
గత ఏడాది కాలంలో పాకిస్థాన్లో గ్యాస్ ధరలు రూ.1,100కు పైగా పెరిగాయి. రూ.160 ఉన్న పిండి ధర ఇప్పుడు 88 శాతం పెరిగింది. అలాగే కిలో రూ.146 ఉన్న బియ్యం ధర 62 శాతం పెరిగింది. దీంతో ఇక్కడి ప్రజలకు తిండిలేక అవస్థలు పడుతున్నారు. గత వారంతో పోలిస్తే పాకిస్థాన్లో 25 నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి.
ధరలు పెరిగిన వస్తువులలో గ్యాస్ ధర 480 శాతం, టీ ప్యాకెట్ 8.9 శాతం, చికెన్ 4 శాతం, ఉప్పు పొడి 2.9 శాతం, గోధుమ పిండి 2.6 శాతం, బంగాళదుంప 2 శాతం చొప్పున పెరిగాయి. ఉల్లి ధర అత్యధికంగా 36 శాతం పడిపోయింది. గత వారంలో పాకిస్థాన్ స్వల్పకాలిక ద్రవ్యోల్బణం 10 శాతం పెరిగింది.