రాజకీయాల్లో శాశ్వత శత్రువులు అంటూ ఉండరని నిరూపించే ఘటన చోటుచేసుకుంది. నిన్న మొన్నటి వరకు కారాలు మిరియాలు నూరుకొన్న జనగామ (Jnagama) బీఆర్ఎస్ (BRS) ముఖ్య నేతలు నేడు ఊహించని విధంగా కనిపించారు. జనగామలో బీఆర్ఎస్ కార్యకర్తల మీటింగ్ జరిగింది. ఈ సమావేశానికి మంత్రులు హరీష్ రావు (Harish Rao), సత్యవతి రాథోడ్ (Satyavathi Rathod) పాల్గొన్నారు. వీరితో పాటు ముత్తిరెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి కూడా స్టేజి పై ఉన్నారు.
అప్పుడే షాక్ అయ్యే సంఘటన జరిగింది. ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి కాళ్లకు పల్లా రాజేశ్వర్ రెడ్డి నమస్కరించారు. భారీ మెజార్టీతో పల్లా రాజేశ్వర్ రెడ్డిని గెలిపించాలని ముత్తిరెడ్డి కోరారు. ఇదంతా మంత్రి హరీష్ రావు ముందే జరిగింది. ఇది చూసిన నేతలు, కార్యకర్తలందరూ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.
జనగామ టికెట్ విషయంలో వీరిద్దరికీ పోటీ ఏర్పడిన విషయం తెలిసిందే. జనగామ టికెట్‌ను సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డికి కాకుండా ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డికి, బీఆర్ఎస్ కేటాయించింది. దీనిపై కొన్ని రోజుల పాటు ముత్తిరెడ్డి అసంతృప్తికి గురైనా.. అధిష్టానం బుజ్జగించడంతో శాంతించి పల్లా గెలుపు కోసం సహకరిస్తున్నారు. నిజానికి రాజకీయాల్లో ఇలాంటి ఘటనలు సర్వసాధారణం. కానీ కార్యకర్తలే సీరియస్ గా తీసుకొని లేనిపోని గోడవల్లో చిక్కుకుంటారు.