బాలీవుడ్ బ్యూటీ పరిణితి చోప్రా (Parinti Chopra) , ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా (Raghav Chadha) వివాహ బంధంలోకి అడుగు పెట్టారు. పెద్దల సమక్షంలో మూడు ముళ్ల బంధంతో వారిద్దరూ ఒక్కటయ్యారు. తాజాగా తమ అభిమానుల కోసం రాఘవ్-పరణితిలు తమ వివాహ ఫోటోలను ఇన్ స్టాలో షేర్ చేశారు. దానికి అదిరిపోయే క్యాప్షన్ పెట్టారు. తాజాగా ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
బ్రేక్ ఫాస్ట్ టేబుల్ వద్ద మొదటి సంభాషణల నుంచి తమ హృదయాలకు తెలుసని క్యాప్షన్ లో పేర్కొన్నారు. అప్పటి నుంచి చాలా కాలంగా తాము ఈ రోజు కోసం ఎదురు చూస్తున్నామని అన్నారు.
చివరికి ఆ రోజు రానే వచ్చిందన్నారు. చివరకు తాము ఇద్దరం మిస్టర్ అండ్ మిసెస్ గా మారిపోయామన్నారు. తాము ఒకరు లేకుండా మరొకరు వుండలేమన్నారు. తమ దాంపత్య జీవితం ఈ రోజు నుంచి మొదలు అని రాసుకొచ్చారు.
రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లోని లీలా ప్యాలెస్ లో వీరి వివాహం అత్యంత ఘనంగా జరిగింది. వీరి వివాహానికి సీఎం కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్, టెన్నిస్ క్రీడాకారిణి సానియా మిర్జాతో పాటు ఇతర రాజకీయ నాయకులు హాజరయ్యారు. వీరితో పాటు బాలీవుడ్ తారలు కూడా హాజరయ్యారు. వీరి జంటను ఇప్పుడు అంతా రాఘ్ నీతి అని పిలుస్తున్నారు.
ఈ వివాహానికి కరణ్ జోహార్ హాజరు కావాల్సి వుండగా చివరి నిమిషంలో గైర్హాజరయ్యారు. ఇక పరిణితి వివాహానికి ఆమె కజిన్ బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా హాజరవుతారని అంతా అనుకున్నారు.
కానీ బిజీ షెడ్యూల్ వల్ల ప్రియాంక చోప్రా ఈ వివాహానికి హాజరు కాలేకపోయారని ప్రియాంక తల్లి వెల్లడించారు. తాజాగా పరిణితి వివాహ ఫోటోలపై ఆమె కామెంట్ చేశారు. ఆ జంటకు తన ఆశీర్వాదాలు వుంటాయని రాసుకొచ్చారు.