తెలంగాణ (Telangana) ఎన్నికలలో మూడు ప్రధాన పార్టీల మధ్య నువ్వా- నేనా అన్నట్లు ఎన్నికల ప్రచారం సాగుతుంది. ఈ క్రమంలో తెలంగాణ పాలిటిక్స్‌లో జనసేనపార్టీ, ఆపార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ హాట్ టాఫిక్‌గా మారారు. మరోవైపు బీజేపీ (BJP)తో పొత్తులో భాగంగా ఉమ్మడి అభ్యర్థి నేమూరి శంకర్ గౌడ్ తరఫున వికారాబాద్ (Vikarabad) జిల్లాలో తాండూరు (Tandoor) నియోజకవర్గంలో జరిగే ప్రచారంలో జనసేన అధినేత పాల్గొననున్నారు.

ఇప్పటి వరకు కల్లబొల్లి మాటలతో కాలం గడుపుతున్న ప్రతిపక్షాలు.. ఈ ఎన్నికల్లో తాండూర్ ప్రజలను మభ్య పెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయని జనసేనకు ఒక్క సారి అవకాశం ఇస్తే తాండూరు దిశ మార్చి చూపిస్తానని ఎమ్మెల్యే అభ్యర్థి నేమురి శంకర్ గౌడ్ తెలిపారు.
ఇదిలా ఉండగా.. ఇప్పటివరకు ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్న బీసీ ఆత్మగౌరవ సభలో తప్ప పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఎక్కడ కనిపించలేదు. కాబట్టి తెలంగాణలో ఇదే మొదటి ప్రచారం అవుతుంది.. మరి జనసేన అధినేత ప్రచారం తెలంగాణ రాజకీయాలను ఏమేరకు ప్రభావితం చేస్తాయో చూడాలి..