హనుమకొండ (Hanumakonda) జిల్లా వరికోల్ గ్రామంలో పలు అభివృద్ధి పనులు శంకుస్థాపన చేసేందుకు వెళ్లిన స్థానిక ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి (MLA Dharma Reddy) నోరు జారారు. దీంతో ఎమ్మేల్యేకి గ్రామస్థుల నిరసన సెగ (Villegers Protest) తగిలింది. దీంతో ధర్మారెడ్డి తీవ్ర అసహనానికి గురయ్యారు. ఇంతకీ ఏమైయిందంటే…
గ్రామంలో జరిగిన అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమం తర్వాత ఎమ్మేల్యే ధర్మారెడ్డి సభలో మాట్లాడుతుండగా… సభా వేదిక పక్కనే ఉన్న చెట్టు పైకి ఓ వ్యక్తి ఎక్కి అరుస్తూ, కేకలు వేస్తూ వీరంగం సృష్టించాడు. అంతే కాకుండా అందరికి వినపడేటట్లు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీకి వ్యతిరేకంగా నినాదాలు చేశాడు. దీనికి గ్రామస్థులు కూడా సపోర్ట్ చేశారు. ఈ క్రమంలో అసహనానికి గురైన ధర్మారెడ్డి… అంతా వింటున్నానని అన్నారు.
‘మీ బాధ ఏంటో నాకు అర్థమైంది. రోడ్లు, బిల్డింగులు, మహిళా భవనం మాకెందుకని అంటున్నారు. మాకు సొంతానికి ఏమిచ్చారనే ఆలోచన మీ మదిలో ఉంది. మాకేం డబ్బులు, సంక్షేమ పథకాలు అందాయి, నేను మీకు ఏం చేసినానని అంటున్నారు. అంతే కదా” అని అన్న ఎమ్మేల్యే ధర్మారెడ్డి…వెంటనే “ఇప్పటికే మీ గ్రామస్థుడైన ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి మీ ఊరికి చాలా ఎక్కువ చేసిండు’.. అని అన్నారు. దీంతో గ్రామస్థుల నుంచి తీవ్రమైన నిరసన వ్యక్తమైంది.
దీంతో అక్కడ కాస్త గందరగోళ పరిస్థితి ఏర్పడింది. స్థానికులను శాంతిప చేసేందుకు అక్కడి ప్రజాప్రతినిధులు, నాయకులు చాలా ప్రయత్నాలు చేశారు. కానీ వారు నిరసన తెలుపుతూనే ఉన్నారు. దీంతో చేసేదేమీ లేక గ్రామస్థులకు ఇంకా ఏం కావాలో ఆ వివరాలన్ని తెలుసుకుని, అందరికి న్యాయం చేస్తామంటూ ఎమ్మేల్యే హామీ ఇచ్చారు. దీంతో స్థానికులు తమ నిరసనను విరమించుకున్నారు.