తెలంగాణ(Telangana)లో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్(Phone Taping) కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు(DSP Praneeth Rao)తోపాటు మరో ఇద్దరు అధికారులను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేసిన విషయం తెలిసిందే. తాజాగా అజ్ఞాతంలో ఉన్న మరో ముగ్గురు మాజీ అధికారులపై పోలీసులు లుక్ఔట్ నోటీసులు జారీచేశారు.
ఇప్పటి వరకు అరెస్టయిన భూపాలపల్లి ఓఎస్డీ భుజంగరావు, ఎస్ఐబీ అదనపు ఎస్పీ తిరుపతన్నను పోలీసులు నాంపల్లి కోర్టు జడ్జి ముందు హాజరుపరిచారు. కాగా, కొందరు ప్రజాప్రతినిధులు, మాజీ పోలీస్ అధికారులకూ పోలీసులు నోటీసులు జారీ చేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం.
కొందరు ఎమ్మెల్యేలు, ఎంపీలతోపాటు పోలీస్అధికారులు, మాజీ అధికారుల పేర్లు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, టాస్క్‌ఫోర్స్ మాజీ డీఎస్పీ రాధాకిషన్ రావు, శ్రవణ్‌రావు కూడా ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించినట్లు గుర్తించారు.
అయితే ప్రణీత్‌రావు అరెస్టు తర్వాత ఈ ముగ్గురు విదేశాలకు వెళ్లినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఈ నేపథ్యంలో ముగ్గురు మాజీ అధికారులపై పోలీసులు లుక్ఔట్ నోటిసులు జారీచేశారు. ఇప్పటికే వారి ఇళ్లలో సోదాలు చేసిన పోలీసులు శ్రవణ్‌రావు ఇంట్లో కీలకమైన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. విచారణకు హాజరుకావాలని ముగ్గురికీ నోటీసులు జారీచేశారు.