Telugu News » PM Modi: కలిసి పనిచేద్దాం.. సౌదీ యువరాజుతో ప్రధాని మోడీ చర్చలు..!

PM Modi: కలిసి పనిచేద్దాం.. సౌదీ యువరాజుతో ప్రధాని మోడీ చర్చలు..!

ప్రధాని నరేంద్ర మోడీ(PM Modi) సౌదీ అరేబియా యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ఇజ్రాయెల్ హమాస్ మధ్య కొనసాగుతున్న యుద్ధం మధ్య పశ్చిమాసియాలో పరిస్థితిపై కూడా ఇద్దరు నేతలు చర్చించారు.

by Mano
PM Modi: Let's work together.. PM Modi talks with Saudi prince..!

అరేబియా సముద్రంలో(Arabian Sea) ఉద్రిక్తత, ఇజ్రాయెల్ హమాస్ మధ్య కొనసాగుతున్న యుద్ధం(Israel-hamas War) నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ(PM Modi) సౌదీ అరేబియా యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ఇజ్రాయెల్ హమాస్ మధ్య కొనసాగుతున్న యుద్ధం మధ్య పశ్చిమాసియాలో పరిస్థితిపై కూడా ఇద్దరు నేతలు చర్చించారు.

PM Modi: Let's work together.. PM Modi talks with Saudi prince..!

ఉగ్రవాదం, హింస, పౌరుల మరణాలపై ప్రధాని మోడీ ఆందోళన వ్యక్తం చేశారు. ఇరువురు నేతలు పలు అంశాలపై చర్చించారు. అభివృద్ధితో పాటు, ద్వైపాక్షిక వ్యూహాత్మక భాగస్వామ్యం భవిష్యత్తుపై ప్రధాని మోదీ, మహమ్మద్ బిన్ సల్మాన్ మధ్య చర్చలు జరిగాయి. ఈ ప్రాంతంలో శాంతి, భద్రత, సుస్థిరత కోసం కలిసి పనిచేయాలని ప్రధాని మోడీ, మహమ్మద్ బిన్ సల్మాన్ కూడా అంగీకరించారు.

వరల్డ్ ఎక్స్ఫో 2030, ఫిఫా ఫుట్‌బాల్ వరల్డ్ కప్ 2034కి హోస్ట్ ఎంపికైనందుకు సౌదీ అరేబియాను ప్రధాని మోడీ అభినందించారు. గాజాలో రెండున్నర నెలలకు పైగా నెత్తుటి ఘర్షణ జరుగుతోంది. ఇప్పటి వరకు 20 వేల మందికి పైగా మృతిచెందారు. అయినప్పటికీ, గాజాలో ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. హమాస్‌ను నిర్మూలించే వరకు గాజాలో కాల్పుల విరమణ ఉండదని ఇజ్రాయెల్ పేర్కొంది.

ఈ నేపథ్యంలో సౌదీ యువరాజుతో చర్చల అనంతరం ప్రధాని మోడీ సోషల్ మీడియా వేదికగా పలు విషయాలను పంచుకున్నారు. తాము పశ్చిమాసియాలోని పరిస్థితులపై అభిప్రాయాలను ఇచ్చిపుచ్చుకున్నామని పేర్కొన్నారు. ఉగ్రవాదం, హింస, పౌర ప్రాణనష్టం గురించి ఆందోళన వ్యక్తం చేశామని తెలిపారు. శాంతి, భద్రత, సుస్థిరత కోసం కలిసికట్టుగా పనిచేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.

You may also like

Leave a Comment