పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో రంగంలోకి దిగిన ప్రధాని మోడీ (Modi).. ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ (Congress)పై తీవ్రమైన ఆరోపణలు గుప్పిస్తున్నారు.. రాజస్థాన్ (Rajasthan) ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన ఆ పార్టీ చేసిన పాపాలకు దేశం శిక్షిస్తోందని తెలిపారు.. ఒకప్పడు 400 సీట్లు గెలుచుకున్న పార్టీ, ప్రస్తుత ఎన్నికల్లో కనీసం 300 స్థానాల్లో పోటీ చేయలేకపోయిందని విమర్శించారు..

ఆయన ఎప్పుడూ రాజస్థాన్ గురించి మాట్లాడలేదని ఆరోపించిన మోడీ.. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ని కూడా రాజ్యసభకు పంపారు. మీరు ఆయనను ఎప్పుడైనా రాజస్థాన్‌లో చూశారా అని ప్రశ్నించారు.. కాంగ్రెస్ ఆశ్రిత పక్షపాతం, అవినీతి చెదపురుగులను వ్యాప్తి చేయడం ద్వారా దేశాన్ని భ్రష్టు పట్టించిదని మండిపడ్డారు.. 2014కి ముందు ఉన్న పరిస్థితులు మళ్లీ రావాలని దేశం కోరుకోవడం లేదన్నారు.
ఈ రోజు దేశ ప్రజలు కాంగ్రెస్‌పై కోపంతో ఉన్నారని తెలిపిన ప్రధాని.. ఆ పార్టీ చేసిన పాపాలకు శిక్ష అనుభవిస్తోందన్నారు.. ప్రస్తుత పరిస్థితికి వారు అవలంభించిన విధానాలు కారణం అని పేర్కొన్నారు.. ఇదిలా ఉండగా రాజస్థాన్‌లోని 2