Telugu News » PM Modi: ఇది చారిత్రాత్మక రోజు.. ప్రధాని మోడీ ట్వీట్..!

PM Modi: ఇది చారిత్రాత్మక రోజు.. ప్రధాని మోడీ ట్వీట్..!

దేశవ్యాప్తంగా కొనసాగుతున్న 2వేలకు పైగా రైల్వే ప్రాజెక్టులకు ప్రధాని మోదీ ప్రారంభోత్సవంతో పాటు శంకుస్థాపన చేయనున్నారు. ఇదే అంశంపై మోడీ స్పెషల్ ట్వీట్ చేశారు.

by Mano
BJP has a clear majority in both phases. If Congress opposes Modi's decisions, it will be a disaster!

భారతీయ రైల్వేలను కొత్త శిఖరాలకు తీసుకెళ్లడంలో దేశ ప్రధాని నరేంద్ర మోడీ అవిశ్రాంతంగా శ్రమిస్తున్నారు. ఇప్పటికే సెమీ హైస్పీడ్ రైళ్లను నడపడం ద్వారా భారతీయ రైల్వేల సామర్థ్యాన్ని పెంచారు. ముఖ్యంగా రైల్వే మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేసేందుకు ప్రధాని మోదీ ప్రయత్నాలు చేస్తున్నారు.

PM Modi: This is a historic day.. Prime Minister Modi's tweet..!

ఈ నేపథ్యంలో అమృత్ భారత్ స్టేషన్ల ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా కొనసాగుతున్న 2వేలకు పైగా రైల్వే ప్రాజెక్టులకు ప్రధాని మోదీ ప్రారంభోత్సవంతో పాటు శంకుస్థాపన చేయనున్నారు. ఫిబ్రవరి 26న అమృత్ స్టేషన్ పథకం కింద దేశవ్యాప్తంగా 553 రైల్వే స్టేషన్లు , 1,500 రోడ్డు ఓవర్‌బ్రిడ్జిలు, అండర్‌పాస్‌ల పునరాభివృద్ధికి పునాది రాయి వేయనున్నారు.

ఇవాళ మధ్యాహ్నం 12.30 గంటలకు దేశవ్యాప్తంగా రూ.41వేల కోట్ల విలువ గల సుమారు 2000 రైల్వే మౌలిక సౌకర్యాల కల్పన ప్రాజెక్టులను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జాతికి అంకితం చేయనున్నారు. ఇదే అంశంపై మోడీ స్పెషల్ ట్వీట్ చేశారు.

‘ఈ రోజు రైల్వేకు చారిత్రత్మాక రోజు. మధ్యాహ్నం 12.30కు రూ.41వేల కోట్లతో 2000 రైల్వే ప్రాజెక్టు పనులను జాతికి అంకితం చేయనున్నాను. ప్రయాణాలను మెరుగుపరిచేందుకు, అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద 553 స్టేషన్లను పునరుద్ధరించాం. ఈ స్టేషన్లకు శంకుస్థాపన చేయనున్నాను. దేశవ్యాప్తంగా ఓవర్ బ్రిడ్జిలు, అండర్ పాస్ లను ప్రారంభించనున్నాం. భారతదేశం ఓవర్ బ్రిడ్జిలు అండర్‌పాస్ కూడా ప్రారంభించబడతాయి. ఈ పనులతో ప్రజలకు ‘ఈజ్ ఆఫ్ లివింగ్’ ని అందిస్తాయి.’ అని మోడీ ట్వీట్ చేశారు.

You may also like

Leave a Comment