Telugu News » Hyderabad : శోభాయాత్రలో పోలీసుల ధూమ్‌ధామ్‌ !

Hyderabad : శోభాయాత్రలో పోలీసుల ధూమ్‌ధామ్‌ !

ఎక్కడా తమ విధులను విస్మరించకుండా.. అక్కడకి వచ్చిన వేలాది మంది ప్రజలను హుషారెత్తించేలా చేసిన పోలీసుల డ్యాన్సులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

by Prasanna
police dance

గణేశ్ శోభాయాత్ర ప్రశాంతంగా, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జరిగింది. పోలీస్ డిపార్ట్ మెంట్ 40 వేల మందితో బందోబస్తు ఏర్పాటు చేసింది. అయితే.. వీరిలో కొందరు శోభాయాత్రలో భక్తులతో కలిసి సందడి చేస్తూ డ్యాన్సులు చేశారు. ఇది శోభాయాత్రకే హైలెట్ గా నిలిచింది.

police dance

ఎక్కడా తమ విధులను విస్మరించకుండా.. అక్కడకి వచ్చిన వేలాది మంది ప్రజలను హుషారెత్తించేలా చేసిన పోలీసుల డ్యాన్సులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హుస్సేన్‌ సాగర్‌ తో పాటు మొత్తం 100 ప్రాంతాల్లో నిమజ్జనం ఏర్పాట్లు చేశారు. లక్షకుపైగా విగ్రహాల నిమజ్జనం జరిగేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. హుస్సేన్‌ సాగర్‌ పరిసర ప్రాంతాలు మొత్తం జనంతో నిండిపోయాయి. డీజీ సౌండ్స్‌తో ఒక్కో విగ్రహం సాగర్ ని చేరుకుంటుంటే, మరోవైపు వాటిని నిమజ్జనం చేస్తున్నారు.

డ్యాన్సులు చేస్తూ హుషారుగా శోభయాత్ర కొనసాగింది. ఈ క్రమంలోనే డ్యూటీలో బిజీగా ఉన్న పోలీసులు కూడా భక్తులతో కలిసి చిందేశారు. గణేశుడి నిమజ్జన పర్యవేక్షణలో ఉన్న పోలీసులు డీజే సౌండ్‌ కు కాలు కదిపారు. ఓ గ్రూప్‌ గా ఏర్పడ్డ పోలీసులు వేసిన స్టెప్పులు హైలెట్‌ గా నిలిచాయి. అదిరిపోయే స్టెప్పులతో మెస్మరైజ్ చేశారు. ఈ డ్యాన్స్‌ చూసిన నెటిజన్లు పోలీసుల స్టెప్పులకు ఫిదా అవుతున్నారు.

ఇక గణేష్‌ నిమజ్జనాన్ని పురస్కరించుకొని సెప్టెంబర్‌ 28వ తేదీన హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ జంట నగరాల్లో తెలంగాణ ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఏపీ, తెలంగాణ పోలీసులతో పాటు కేంద్ర బలగాలను కూడా రంగంలోకి దింపారు. శోభాయాత్ర ప్రశాంతంగా జరిగింది. ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం, శోభాయాత్రం ఘనంగా కొనసాగింది.

 

You may also like

Leave a Comment