Telugu News » Maoists : మహారాష్ట్రలో మావోల భారీ కుట్రను భగ్నం చేసిన పోలీసులు….!

Maoists : మహారాష్ట్రలో మావోల భారీ కుట్రను భగ్నం చేసిన పోలీసులు….!

మహారాష్ట్ర (Maharastra) లో మావోయిస్టు (Maoist) ల కుట్రను పోలీసులు భగ్నం చేశారు.

by Ramu
Police have foiled a Maoist conspiracy in Maharashtras Gadchiroli district

మహారాష్ట్ర (Maharastra) లో మావోయిస్టు (Maoist) ల కుట్రను పోలీసులు భగ్నం చేశారు. గడ్చి రోలీ జిల్లా బెడెన్ ఘాట్ అటవీ ప్రాంతంలో భారీగా మందు పాతరల ( Land mine) ను పోలీసులు గుర్తించారు. కుర్కెడా సబ్ డివిజన్ లోని బెడెన్ ఘాట్ అటవీ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్న సమయంలో ఈ మందుపాతరలను గుర్తించినట్టు పోలీసులు వెల్లడించారు.

Police have foiled a Maoist conspiracy in Maharashtras Gadchiroli district

మావోయిస్టుల వారోత్సవాల నేపథ్యంలో మందు పాతరలను గుర్తించడం ఆందోళన కలిగిస్తోంది. వారోత్సవాల నేపథ్యంలో పెద్ద ఎత్తున దాడులకు పాల్పడేందుకు మావోలు కుట్రలు పన్ని వుంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. అందుకే ఈ మందుపాతరలను పాతి పెట్టి వుంటారని చెబుతున్నారు. అటవీ ప్రాంతంలో పోలీసు బలగాలపై దాడి చేసి భారీ విద్వంసం సృష్టించాలని మావోలు కుట్రపని వుంటారని అంటున్నారు.

సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్న సమయంలో డీఎస్ఎండీ డివైజ్ తో ఈ మందు పాతరను గుర్తించారు. అనంతరం ఈ సమాచారాన్ని జిల్లా అదనపు ఎస్పీ(ఆపరేషన్స్)కు సమాచారం అందించారు. దీంతో బీడీడీఎస్ బృందాన్ని ఘటనా స్థలానికి పంపించారు. ఆ తర్వాత అక్కడ నాలుగు పౌచ్ లను పోలీసులు గుర్తించారు.

ఆ గుంతలో ఒకటి న్నర నుంచి రెండు ఫీట్ల లోతులో పేలుడు పదార్థాలను పాతి పెట్టారని చెప్పారు. మావోయిస్టులు లొంగిపోయి జన జీవన స్రవంతిలో కలిసి పోవాలని ఈ సందర్బంగా పోలీసులు సూచించారు. ఇప్పటికైనా మావోలు హింసా మార్గాన్ని వీడి గౌరవప్రదమైన జీవితాన్ని గడపాలన్నారు.

You may also like

Leave a Comment