రాష్ట్రంలో మూడు పార్టీల మధ్య తీవ్ర స్థాయిలో రాజకీయ విమర్శలు చోటు చేసుకోవడం కనిపిస్తోంది.. ఇప్పటికే బీఆర్ఎస్ పరిస్థితి ఆగమ్య గోచరంగా మారిందనే టాక్ వినిపిస్తుండగా.. పార్లమెంట్ పోరులో కాంగ్రెస్ (Congress), బీజేపీ (BJP) ప్రధాన పాత్ర పోషిస్తాయని అనుకొంటున్నారు.. ఇక లోక్ సమరానికి సమయం సమీపిస్తుండటంతో.. నేతలు విమర్శల డోస్ పెంచడం కనిపిస్తోంది..
ఈ నేపథ్యంలో తాజాగా రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈటలకు.. బండి సంజయ్ కి పడదని బాంబ్ పేల్చారు. కాంగ్రెస్, బీజేపీ మధ్యనే ఫైట్ అని తెలిపిన ఆయన.. తెలంగాణలో బీఆర్ఎస్ ఔట్ అన్నారు. బండి సంజయ్ ని అధ్యక్ష పదవి నుంచి ఎందుకు తొలగించారో చెప్పాలని డిమాండ్ చేశారు.. ఆయనపై ఉన్న అవినీతి ఆరోపణలు.. కరీంనగర్ లో ఏ నేతకు లేవన్నారు..
పదవిలో ఉన్నన్ని రోజులు కరీంనగర్ (Karimnagar) ప్రజలకు ఏం చేశావో సమాధానం చెప్పాలని డిమాండ్ చేసిన పొన్నం.. బండి సంజయ్ కి గంగుల కమలాకర్ కి ఎంత సాన్నిహిత్యం ఉందో అందరికి తెలుసన్నారు. వర్షాలు పడే సమయంలో బీఆర్ఎస్ (BRS) అధికారంలో ఉందని తెలిపిన మంత్రి.. మేము అధికారం లోకి వచ్చింది డిసెంబర్ లో అది వర్షాకాలం కాదని వివరించారు. అయినా వాళ్ళు దానికి బాద్యులని అనట్లేదన్నారు.
పంట నష్టం గురుంచి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు.. ఒక నటుడు ఆస్కార్ అవార్డు పొందాలంటే ఎంత తాపత్రయం పడుతారో.. ప్రస్తుతం బండి సంజయ్ కూడా అంత తాపత్రయం పడుతున్నారని పొన్నం ప్రభాకర్ వ్యంగాస్త్రం వదిలారు.. బండి సంజయ్ అవినీతి పరుడు కాదని కిషన్ రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు. పార్టీ, ప్రభుత్వానికి మధ్య గ్యాప్ గురించి పార్టీ ఇంచార్జ్ దీపాదాస్ మున్సీ చూసుకుంటారని తెలిపారు.
మరోవైపు నగర తాగు నీటి అవసరాలకు సింగూర్ నుంచి 18 శాతం, గోదావరి నుంచి 35 శాతం కృష్ణా నుంచి 45 శాతం, ఉస్మాన్ సాగర్ నుంచి 4 శాతం నీటిని వాడుతున్నామని పొన్నం క్లారిటీ ఇచ్చారు. నాగార్జున సాగర్ లో 510 అడుగుల నీళ్లు ఉన్నాయని తెలిపిన ఆయన.. అవసరమైతే బూస్టర్ పైప్ ల ద్వారా వాటర్ తరలిస్తామన్నారు. ఎల్లంపల్లి నుంచి కూడా 3 టీఎంసీలు హైదరాబాద్ కి తరలిస్తున్నామని వివరించారు..