Telugu News » Pooja Hegde : ఆ క్రికెటర్ తో త్వరలో పూజా హెగ్డే పెళ్లి?

Pooja Hegde : ఆ క్రికెటర్ తో త్వరలో పూజా హెగ్డే పెళ్లి?

ఇదిలా ఉంటే పూజ హెగ్డే ముంబైకి చెందిన క్రికెటర్ ని గత కొద్ది రోజులుగా ప్రేమిస్తుందని, ఇక ఈమె కాలంలో ఓ ప్రైవేట్ పార్టీలో ఆ క్రికెటర్ తో కలిసి రావడంతో వీరి ఫోటోలు నెట్టింట్లో వైరలవడంతో నిజంగానే వీరి మధ్య ఏదో నడుస్తుంది అని అందరూ మాట్లాడుకుంటున్నారు.

by Prasanna
Pooja Hegde

అలవైకుంఠపురం సినిమాతో బుట్టబొమ్మగా అందరి మనసులు దోచుకుంది పూజ హెగ్డే (Pooja Hegde). ఇప్పుడు ఈ బుట్టబొమ్మ పూజ గురించి తాజాగా సోషల్ మీడియాలో ఒక ట్రెండింగ్ న్యూస్ నడుస్తోంది. అదేంటంటే పూజ హెగ్డే త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతోందట. సోషల్ మీడియా (Social Media) లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం పూజ హెగ్డే ముంబై కి చెందిన ఓ స్టార్ క్రికెటర్ (Star Cricketer) తో ప్రేమలో ఉందని, త్వరలోనే వీళ్ళిద్దరూ ఒక్కటి కాబోతున్నారని టాక్ వినిపిస్తోంది.

Pooja Hegde

పూజ హెగ్డే కెరియర్ ఈ మధ్యకాలంలో అంత ఆశాజనకంగా లేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈమె నటించిన వరుస సినిమాలు అట్టర్ ప్లాఫ్ అవడంతో వెనక్కి తగ్గిందని చెప్పవచ్చు. ఇక పూజ హెగ్డే చేతిలో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా తప్ప తెలుగులో ఇంకో అవకాశం లేదు. ఇదిలా ఉంటే పూజ హెగ్డే ముంబైకి చెందిన క్రికెటర్ ని గత కొద్ది రోజులుగా ప్రేమిస్తుందని, ఇక ఈమె కాలంలో ఓ ప్రైవేట్ పార్టీలో ఆ క్రికెటర్ తో కలిసి రావడంతో వీరి ఫోటోలు నెట్టింట్లో వైరలవడంతో నిజంగానే వీరి మధ్య ఏదో నడుస్తుంది అని అందరూ మాట్లాడుకుంటున్నారు.

పూజ హెగ్డేకి గ్లామర్ తో పాటు అదృష్టం కూడా కలిసి రావడంతో టాలీవుడ్ లో విజయవంతమైన చిత్రాలు పడ్డాయి. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే పూజా హెగ్డే తరచుగా గ్లామరస్ ఫోటో షూట్స్ చేస్తూ ఉంటుంది.  కొంత కాలం నుంచి పూజా హెగ్డే కి సౌత్ లో కలసి రావడం లేదు. దీనితో పూజా హెగ్డే బాలీవుడ్ లో పాగా వేసేందుకు ప్రయత్నిస్తోంది. పూజా హెగ్డే చివరగా సల్మాన్ ఖాన్ కిసీకి భాయ్ కిసీకి జాన్ అనే చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే.  ఇది కూడా పాజిటివ్ రిజల్ట్ ఇవ్వలేదు.

దీంతో పూజా హెగ్డే బాలీవుడ్ లో సరైన హిట్ కొట్టలేకపోయింది. ఇదిలా ఉండగా ఇటీవల పూజా హెగ్డే టాలీవుడ్ లో మహేష్ బాబు గుంటూరు కారం చిత్రం నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. పూజాహెగ్డే కి చివరగా టాలీవుడ్ లో కలసి రాలేదు. రాధే శ్యామ్, ఆచార్య లాంటి చిత్రాలు తీవ్రంగా నిరాశ పరిచాయి.

సోషల్ మీడియాలో ట్రెండింగ్ మారిన పూజ హెగ్డే పెళ్లి విషయంలో నిజానిజాలు తెలియాలంటే ఆ స్టార్ క్రికెటరో, పూజా హెగ్డేనో అధికారికంగా ప్రకటించాల్సిందే.

 

You may also like

Leave a Comment