నేటి రోజుల్లో ఎక్కువ శాతం ప్రజలు రకరకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. వాటిలో క్యాన్సర్ కూడా ఒకటి. ఒకప్పుడు నూటికో, కోటికో ఒకరికి వచ్చేది. కానీ ప్రస్తుతం ఇది చాలా కామన్ గా మారిపోయింది. అందులో రాబోయే రోజుల్లో క్యాన్సర్ తో బాధపడే వారి సంఖ్య పెరుగుతోందని ఆరోగ్య సంస్థ ఓ నివేదికలో వెల్లడించింది. దీనికి కారణం మారుతున్న జీవన విధానం.. ఆహారపు అలవాట్లు అని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
మరోవైపు క్యాన్సర్ వస్తే దాదాపుగా లైఫ్ టైమ్ తగ్గిపోవడం జరుగుతుందని నిపుణులు అంటున్నారు. ఈ ప్రమాదకరమైన వ్యాధి, శరీరాన్ని లోపలి నుండి ఖాళీ చేస్తుంది. ఇందులో కణాలు అసాధారణంగా పెరగడం ప్రారంభించి కణితి ఏర్పడుతుంది. క్రమంగా అది తన స్థలం నుండి ఇతర అవయవాలకు వ్యాపిస్తుంది. అందువల్ల, మీరు మీ జీవనశైలిని మెరుగుపరచడం ద్వారా ఈ ప్రమాదాన్ని తగ్గించవచ్చని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు.
ఇకపోతే మనం తినే ఆహారం క్యాన్సర్ అభివృద్ధిని ప్రభావితం చేస్తుంది. అధిక శక్తి , అధిక కొవ్వు పదార్ధాలు ఊబకాయాన్ని పెంచుతాయి. కొన్ని రకాల క్యాన్సర్లకు దారితీస్తాయని పరిశోధకులు అంటున్నారు. మీరు ఈ వ్యాధిని నివారించాలనుకుంటే, బంగాళాదుంపలను (Potato) తప్పుడు మార్గంలో తినడం నివారించాలని పేర్కొంటున్నారు.. బంగాళదుంపలో అక్రిలామైడ్ (Acrylamide) అనే రసాయనం (chemical) ఉంటుంది.
నేషనల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ (RIF) ప్రకారం, ఇది క్యాన్సర్కు కారణమయ్యే అవకాశం ఉందని.. అందువల్ల బంగాళాదుంపలను కొన్ని రకాల చక్కెరలతో అధిక ఉష్ణోగ్రత వద్ద కాల్చడం వల్ల క్యాన్సర్ వస్తుందని వెల్లడిస్తున్నారు. అదీగాక పిండి పదార్థం ఎక్కువగా ఉండే దుంప కావడంతో వండే విధానంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు.. తాజాగా నిర్వహించిన కొన్ని సర్వేల్లో ఆలూ తింటే క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని కొన్ని అధ్యయనాలు వెల్లడించాయి. అందుకే వీటిని తీసుకొనేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు..
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్త పబ్లిష్ చేయడం జరిగింది. ఏమైనా అనుమానాలుంటే సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి.