Telugu News » Prakash Raj : మోడీ గొప్ప నటుడు.. పార్లమెంట్ లో హోమం చేయడమేంటి?

Prakash Raj : మోడీ గొప్ప నటుడు.. పార్లమెంట్ లో హోమం చేయడమేంటి?

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపైనా మండిపడ్డారు ప్రకాష్ రాజ్. ఆయన ఏం మాట్లాడుతున్నారో ఆయనకైనా తెలుసా? అంటూ ఫైరయ్యారు. యువతతో కూరగాయలు అమ్మిస్తారా.. ఇదేం విజన్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

by admin
raghunandan fire on prakash raj

– కేసీఆర్ పీఎం మెటీరియల్
– మోడీది అంతా డ్రామా
– బీజేపీ వాళ్లు జోకర్లు
– నాపై యాంటీ హిందూ ముద్ర వేశారు
– దేశాన్ని బీజేపీ నుంచి కాపాడాలి
– ప్రకాష్ రాజ్ సంచలన వ్యాఖ్యలు

బీజేపీ (BJP) అంటే పడనివాళ్లలో ముందుంటారు నటుడు ప్రకాష్ రాజ్ (Prakash Raj). ఓవైపు సోషల్ మీడియాలో ప్రశ్నించే ఆయన.. అప్పుడప్పుడు మీడియా ముందుకొస్తుంటారు. తాజాగా ఓ తెలుగు ఛానల్ కి ఇంటర్వ్యూ ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ (Telangana) ఫైట్ లో బీజేపీ లేనే లేదన్నారు. జోకర్లు వస్తుంటారు పోతారు అంటూ విమర్శలు చేశారు. బీజేపీకి సౌత్ లో చరిత్ర ఎక్కడిదన్న ఆయన.. కర్ణాటక (Karnataka)లో కాస్త ఓట్ షేర్ ఉందన్నారు. ఎన్నో కథలు చెప్తారని.. తెలంగాణలో గ్రౌండ్ రియాలిటీ చూసుకోవాలని చెప్పారు. గతంలో బీజేపీకి ఎన్ని డిపాజిట్లు పోయాయో గుర్తు చేసుకోవాలన్నారు.

raghunandan fire on prakash raj

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy) పైనా మండిపడ్డారు ప్రకాష్ రాజ్. ఆయన ఏం మాట్లాడుతున్నారో ఆయనకైనా తెలుసా? అంటూ ఫైరయ్యారు. యువతతో కూరగాయలు అమ్మిస్తారా.. ఇదేం విజన్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను దేవుడ్ని నమ్మనని.. కాకపోతే తన భార్య నమ్ముతుందని ఆమెతోపాటు హోమాల్లో, పూజల్లో పాల్గొంటానని చెప్పారు. తన తల్లి క్రిస్టియన్ అని.. ఆమె చర్చి వెళ్తుందని తెలిపారు. ధర్మాన్ని, దేవుడ్ని నమ్ముకున్నవాళ్లే కొట్టుకుంటున్నారని.. గుళ్లు కట్టడం, హిందూయిజం అనడం పాలిటిక్స్ కాదన్నారు.

దేశ్ కీ మట్టి అనే మోడీ (Pm Modi) నినాదం నాటకమన్న ప్రకాష్ రాజ్.. మట్టిని కుండలో తీసుకుని.. కింద పోయి.. బొట్టు పెట్టుకుని దండం పెట్టడమేంటని ప్రశ్నించారు. ఇది నమ్మకం కాదు ఎగ్జిబిషన్ అంటూ సెటైర్లు వేశారు. ఈ సందర్భంగా పార్లమెంట్ లో హోమం చేయడంపై అభ్యంతరం తెలిపారు. ఇది ప్రధాని చేసే పనేనా? తన ఇంట్లో వంద హోమాలు చేసుకోవచ్చు.. పార్లమెంట్ భవనంలో ఎందుకని నిలదీశారు. ప్రధాని పోస్ట్ కు మోడీ రెస్పెక్ట్ ఇవ్వడం లేదన్న ఆయన.. దేశాన్ని బీజేపీ నుంచి కాపాడాలని అన్నారు. మోడీలో గొప్ప నటుడు ఉన్నాడంటూ చురకలంటించారు.

ఇక, తెలంగాణ సీఎం కేసీఆర్ పీఎం మెటీరియల్ అని కొనియాడారు ప్రకాష్ రాజ్. ఆయన్ని బాగా అర్థం చేసుకోవాలని.. కేసీఆర్ ది గొప్ప విజన్ అని తెలిపారు. తానకు కేసీఆర్ తో ప్రత్యేక అనుబంధం ఉందన్నారు. బీజేపీతో బీఆర్ఎస్ కలవాల్సిన అవసరం ఏంటన్న ఆయన.. మోడీ రోజుకో వేషం వేస్తారని విమర్శించారు. కేటీఆర్ ను సీఎం చేయాలని మోడీని కలిసే దారిద్ర్యం కేసీఆర్ కు లేదని స్పష్టం చేశారు ప్రకాష్ రాజ్. ఎన్నికల వేళ ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

You may also like

Leave a Comment