ఖేలో ఇండియా (Khelo India) లాంటి పతకాల (Medals) తో దేశంలో అన్ని గ్రామాల్లో, అన్ని మూలల్లో వున్న క్రీడాకారుల కు జాతీయ స్థాయిలో (National Level) గుర్తింపు లభించిందని ప్రధాని మోడీ (PM Modi) అన్నారు. అదే సమయంలో టాప్స్ లాంటి పతకాలతో జాతీయ స్థాయి క్రీడాకారులకు అన్ని రకాల సౌకర్యాలను కల్పించామని చెప్పారు.
దేశంలో 2014తో పోలిస్తే ఇప్పుడు ఖేల్ బడ్జెట్ మూడు రెట్లు పెరిగిందని ప్రధాని తెలిపారు. ఆసియా క్రీడల్లో పాల్గొన్న క్రీడాకారులతో ప్రధాని మోడీ ఈ రోజు సమావేశం అయ్యారు. ఈ సందర్బంగా భారత్ కు అత్యధిక పతకాలు తీసుకు వచ్చి దేశ కీర్తి ప్రతిష్టలను పెంచిన క్రీడాకారులను ఆయన అభినందించారు. ప్రతీ విజయం ఇంటి నుంచే మొదలవుతుందన్నారు.
అందుకే క్రీడాకారుల తల్లిదండ్రులకు తాను మొదటగా శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నట్టు చెప్పారు. ఏషియన్ గేమ్స్‌లో మన క్రీడాకారుల చారిత్రక ప్రదర్శనను బట్టి చూస్తే మనమంతా సరైన దిశలోనే వెళ్తున్నట్టు కనిపిస్తోందన్నారు. ఏషియన్ గేమ్స్ లో మన క్రీడాకారులు సాధించిన పతకాలు దేశ విజయానికి చిహ్నాలని అన్నారు. ఆసియా క్రీడల్లో మన క్రీడాకారుల ప్రదర్శనను చూసి దేశం మొత్తం ఇప్పుడు గర్వ పడుతోందని వెల్లడించారు.
అథ్లెట్లకు శిక్షణ ఇచ్చిన కోచ్, ట్రైనర్లకు దేశం తరఫున తాను కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. ఖేలో ఇండియా కింద 3000 మందికి శిక్షణ ఇస్తున్నామని చెప్పారు. రాబోయే ఐదేండ్లలో క్రీడాకారుల కోసం తమ ప్రభుత్వం మరో 3000 కోట్లను అధికంగా ఖర్చు చేస్తుందన్నారు. ఆసియా క్రీడల్లో భారత క్రీడాకారులు సత్తా చాటారు. ఆసియా క్రీడల్లో మొదటి సారిగా భారత్ క్రీడాకారులు పతకాల సెంచరీ కొట్టారు. మొత్తం 107 పతకాలతో నాల్గవ స్థానంలో భారత్ నిలిచింది. అందులో 28 స్వర్ణాలు వున్నాయి.