ఇజ్రాయెల్-హమాస్(Israel-Hamas)తో పాటు ఉగ్రవాదులతో పోరాడుతుండగా మరోవైపు ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారులు ఎక్కువయ్యాయి. ఇజ్రాయెల్ సైన్యం ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ చాలా మంది బందీలను తిరిగి తీసుకురావడంలో విఫలమైందనే చెప్పవచ్చు. ఈ క్రమంలో బందీల కుటుంబాలు వారిని వెనక్కి తీసుకురావాలంటూ ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది.
ఈ క్రమంలోనే హైఫాలో నిరసనకారులు ప్రభుత్వాన్ని దోషిగా చూస్తోంది. తాజాగా ఇజ్రాయెల్(Israel)లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు మరోసారి హోరెత్తాయి. వేలాది మంది ప్రజలు వీధుల్లోకి వచ్చి ఇజ్రాయెల్ ప్రధాని( Israeli Prime Minister) బెంజమిన్ నెతన్యాహు(Benjamin Netanyahu) రాజీనామా(resignation) చేయాలంటూ నిరసనకు దిగారు.
టెల్ అవీవ్, సిజేరియా, హైఫా వీధుల్లో వేలాది మంది ప్రదర్శనలు చేస్తూ ఆందోళనలు చేపట్టారు. దేశంలో ముందస్తు ఎన్నికలకు పిలుపునివ్వాలని, హమాస్ చేతిలో బందీలుగా ఉన్న ప్రజలను విడుదల చేయాలని నిరసనకారులు కోరారు. నెతన్యాహూ దేశాన్ని నాశనం చేశాడంటూ ఆరోపించారు. తామెవరికీ భయపడమని, బంధీలను సజీవంగా తీసుకొస్తామంటూ టెల్ అవీవ్‌లో నిరసనకారులు నినాదాలు చేశారు. వారిని తీసుకొచ్చేది శవపేటికల్లో మాత్రం కాదని తేల్చిచెప్పారు.
అయితే ప్రభుత్వ వ్యతిరేక ర్యాలీలో వారిని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించగా, పలువురికి గాయాలయ్యాయి. గాజాలో ఇప్పటికీ హమాస్ చేతిలో ఉన్న దాదాపు వంద మంది బందీల కుటుంబాలతో మితవాద ప్రభుత్వ వ్యతిరేకులు ఏకం కావడంతో ప్రస్తుత ప్రధానిపై ఒత్తిడి పెరుగుతోంది. హమాస్ అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై ఆకస్మిక దాడిని ప్రారంభించి, దాదాపు 250 మందిని బంధించింది.
మరోవైపు తూర్పు లెబనాన్‌లోని బెకా వ్యాలీపై ఇవాళ (ఆదివారం) తెల్లవారుజామున ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది. సిరియా సరిహద్దుకు సమీపంలోని జనతా గ్రామంలో హిజ్బుల్లా శిక్షణా శిబిరాన్ని లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ దాడి చేసినట్లు వర్గాలు తెలిపాయి. అయితే, తూర్పు నగరమైన బాల్బెక్క సమీపంలో ఉన్న సఫారి పట్టణంపై దాడి జరిగినట్లు తెలిపారు. ఇందులో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు.