బీఆర్ఎస్(BRS) అధికారంలో ఉంటే నిజాంలు లేకుంటే హిందువులా అని మాజీ ఎమ్మెల్యే, మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్‌రావు ప్రశ్నించారు. బీజేపీ(Bjp) రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. మాజీ మంత్రి హరీశ్‌రావు(Harishrao)కు పలు ప్రశ్నలను సంధించారు.
వరంగల్‌లో పూజారి హత్య జరిగినప్పుడు హిందువునని గుర్తుకు రాలేదా? ఆ కుటుంబాన్ని పరామార్శించారా? అని ప్రశ్నించారు. భైంసాలో సంక్రాంతికి హిందువుల పై దాడులు జరిగితే మీ మామ ఎందుకు పోలేదు? అంటూ మండిపడ్డారు. హిందూ గాళ్ళు బొందు గాళ్ళు అనప్పుడు ఏమైంది? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పరీక్షల్లో ఎంట్రీల సమయంలో ఆడపిల్లల మెడలో తాళి బొట్టు తీసేసినప్పుడు మీలో హిందువు ఏమయ్యాడు? అని రఘునందన్‌రావు ప్రశ్నించారు.
అదేవిధంగా చెంగిచర్ల ఘటనలో బాధితుల దగ్గరకు వెళ్ళారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. యాదగిరి గుట్ట ఆలయం నిర్మాణం దాతల ఫోన్లు కూడా టాప్ చేసి వాళ్ళ దగ్గర కూడా డబ్బులు లాక్కుని ఉంటారని, దేవుణ్ణి కూడా వదిలిపెట్టలేదన్నారు. హిందుత్వానికి పతిరేకంగా పనిచేసి ఇప్పుడు హనుమాన్ చాలీసా వచ్చు అని హరీశ్‌రావు నాలుగు తప్పులు చదివి కొత్త నాటకానికి తెర లేపాడంటూ మండిపడ్డారు. ఇప్పుడు మోకాళ్ల మీద యాదగిరిగుట్ట ఎక్కినా ప్రజలు మిమ్మల్ని నమ్మరని అన్నారు.
అదేవిధంగా తమ ఫోన్లు ట్యాపింగ్ అవుతున్నాయని దుబ్బాక ఎన్నికల సమయంలోనే తాను చెప్పానని రఘునందన్ రావు చెప్పుకొచ్చారు. రాధాకిషన్ ఇప్పుడు ట్యాప్ చేశామని ఒప్పుకున్నాడని చెప్పారు. అందులో దుర్మార్గంగా మా మీద కేసు పెట్టారన్నారు. ‘వివేక్ వెంకట స్వామి, కోమటి రెడ్డి రాజ్ గోపాల్‌రెడ్డిలు ఇప్పుడు అధికార పార్టీలో ఉన్నారు.. మీరు శిక్షించే స్థానంలో ఉన్నారు..’ అంటూ వ్యాఖ్యానించారు.
2015లో రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని పక్కన పెట్టీ ఆ తర్వాత జరిగిన పోన్ ట్యాపింగ్‌లపై విచారణ అంటున్నారని తెలిపారు. రేవంత్ రెడ్డీ ఫోన్ ట్యాప్ చేసినప్పుడు ఇంటిలిజెన్స్ చీఫ్ ప్రస్తుత ఇంటిలిజెన్స్ చీఫ్ శివదర్ రెడ్డి కాదా? అని ప్రశ్నించారు. 2014 జూన్ 2 నుంచి జరిగిన పోన్ ట్యాపింగ్‌లపై విచారణ జరపాలని రఘునందన్‌రావు డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో మొదటి ముద్దాయి కేసీఆర్, రెండో ముద్దాయి హరీశ్‌రావు, మూడో ముద్దాయిగా వెంకట్ రాంరెడ్డి, నాలుగో ముద్దాయిగా కేటీఆర్ పేరు చేర్చాలని డిమాండ్ చేశారు.